కథలు ఎక్కడ నుంచో ఆకాశం నుంచి ఊడిపడవు. వాటికి ప్రేరణ కలిగించే విషయాలు ఉంటాయి. రచయితలు, దర్శకులు ఎక్కడో చోట నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటారనేది నిజం. అలాగే తెలుగు పరిశ్రమలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా ఓ బాలీవుడ్ చిత్రం నుంచి ప్రేరణ పొందారని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఏమిటి..అందులో నిజమెంత.

దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ‘ఫౌజీ’ చిత్రం సినిమా పీరియాడిక్ వార్ లవ్ స్టోరీగా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి ఓ బాలీవుడ్ చిత్రం నుంచి ఇన్‌స్పైర్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘వీర్ జారా’ చిత్రమే ఈ సినిమాకు ప్రేరణ అని, రెండింటిలోనూ ట్విస్ట్ ఒకటే అంటున్నారు.

‘వీర్ జారా’ చిత్రంలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో బందీగా మారుతాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఇదే తరహా స్టోరీలైన్‌ను హను రాఘవపూడి ఫౌజీ చిత్రానికి తీసుకున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ ప్రేమ కోసం ఓ సైనికుడు ఖైదీగా ఎలా మారాడు అనేది ఫౌజీ చిత్ర కథగా మనకు చూపెట్టబోతున్నారట.

‘ఫౌజీ’ సినిమాలో అందాల భామ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే అలాంటిదేమీ లేదని,తనది ఒరిజనల్ స్టోరీ అని దర్శకుడు కొట్టి పారేస్తున్నారు. ఈ సినిమా కథ నిజంగానే బాలీవుడ్ చిత్రం నుంచి ఇన్‌స్పైర్ అయ్యిందా అనేది వేచి చూడాల్సిన అంశం.

#Fauji, #Hanu Raghavapudi, #Imanvi, #Prabhas, #SRK

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *