ఇప్పుడు అందరి దృష్టీ అల్లు అర్జున్, అట్లీకి సంబంధించిన అప్డేట్ పైనే ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న అప్డేట్ రానుంది. గత కొన్ని రోజులుగా చెన్నైకి బన్నీ వెళ్లాడని, అట్లీతో, సన్ పిక్చర్స్‌తో చర్చలు జరిగాయని అన్నారు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా అనౌన్స్మెంట్ ఉంటుందని అంతా అన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్ మెంట్ విషయమై మరో కొత్త అప్డేట్ వచ్చింది.

బన్నీ-అట్లీ అనౌన్స్ మెంట్ కోసం యుఎస్ లో షూట్ చేసిన వీడియోతో వస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఫ్యాన్ ఇండియా కాదని ఇంటర్నేషనల్ వెంచర్ అని వినికిడి. అభయంకర్ ఈ సినిమాకు సంగీతం ఇవ్వబోతున్నారు.

మరో ప్రక్క బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా ప్రధాన కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

,
You may also like
Latest Posts from