‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) నిర్మాతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) లీగల్ నోటీసులు పంపారు.
గతంలో తాను స్వరాలు సమకూర్చిన మూడు పాటలను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగానూ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. వెంటనే ఆ సాంగ్స్‌ను తొలగించి, మేకర్స్ క్షమాపణ చెప్పాలని కోరారు.
అజిత్ (Ajith) హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తెరకెక్కించిన చిత్రమిది. ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే.
అజిత్ ఈ చిత్రంలో ఏకేగా రెడ్ డ్రాగన్‌గా రెండు భిన్న కోణాలున్న పాత్రల్లో స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే నడిపించే ప్రయత్నం చేశారు.
ప్రతి షాట్‌లోనూ తన స్వాగ్‌ను.. హీరోయిజాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చూపించగలిగారు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. ద్వితీయార్ధంలో ఆయన వింటేజ్ లుక్స్ ప్రేక్షకులకు ‘వాలి’, ‘బిల్లా’ రోజుల్ని గుర్తుచేశాయి. సినిమాలో ఆయన పాత్ర మినహా మరే పాత్రలోనూ బలమైన ఎమోషన్ కనిపించదు.