నానితో అంటే సుందరానికి అనే సినిమా చేసిన నజ్రియా నజీమ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూంటుంది.

గతేడాది చివర్లో ‘సూక్ష్మదర్శిని’ మలయాళ చిత్రంతో హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన నాటినుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో రకరకాల కామెంట్స్ మొదల య్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా నజ్రియా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసింది. ‘నేను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నాను.

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాలో సక్సెస్ మీట్లు.. ఇలా దేనికీ నేను అటెండ్ కాలేదు. చాలావాటిని మిస్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ఫోన్లు కూడా ఎత్తలేదు. వారి మెసేజ్లకు స్పందించలేదు. నా వల్ల ఎవరైనా బాధపడుంటే.. దయచేసి క్షమించండి.

https://www.instagram.com/p/DIgn0v7xSJm/?utm_source=ig_web_copy_link

అలాగే పనికోసం నన్ను సంప్రదించాలనుకున్న నా సహనటులు కూడా నన్ను మన్నించాలని వేడుకుంటున్నాను. అందరికీ కనిపించకుండా పోయి ఇబ్బందిపెట్టినందుకు సారీ.

ఇకపోతే ఉత్తమ నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు థాంక్యూ. ఈ జర్నీ కష్టంగా ఉంది. నేను త్వ రలోనే కోలుకొని మీ ముందుకువస్తాను. నా పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకుని అండగా ఉంటారని ఆశిస్తున్నాను’ అంటూ నజ్రియా పోస్టులో వెల్లడించింది.

అయితే, ఈ పోస్టులో ఆమెకు ఏ సమస్య ఉందో చెప్పకపోవడంతో ఆరోగ్య సమస్యనా? లేక ఇంకేదైననా? అని అభిమానులు చర్చింకుంటున్నారు. అంతేకాకుండా తన భర్త ఫహద్ ఫాజిల్ తో విడిపోతుందా? అని కూడా డిస్కషషన్ నడుస్తోంది. వీరిమధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? విడాకులు తీసుకోబోతున్నారా అని అనుకుంటున్నారు. ఏదేమైనా నజ్రియా ఈ విషయంపైనా మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది.

,
You may also like
Latest Posts from