ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు డానీ బాయిల్ మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2008లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు డానీ బాయిల్.
8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ఈ సినిమా ద్వారా రెండు ఆస్కార్‌లు లభించడం విశేషం.
ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ ‘28 Years Later’, గత దశాబ్దాల్లో సంచలనం సృష్టించిన ’28 Days Later’ (2002), ’28 Weeks Later’ (2007) సినిమాలకు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి భాగం 28 ఇయర్స్ లేటర్ (28 Years Later) జున్ 20న విడుదల కానుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఒకప్పుడు రేజ్ వైరస్ మహమ్మారి లాగా విస్తరించి, బ్రిటన్ మొత్తం జాంబీల చెరలో పడిపోయింది. కొన్ని మంది బాధితులు – కొంతమంది అదృష్టవంతులు – దూరమైన ఓ ఐలాండ్‌లో ఆశ్రయం పొందుతారు. సంవత్సరాల పాటు అక్కడే జీవిస్తూ ఉంటారు.
కానీ… “ఒక రోజు… అక్కడకి జాంబీలు ఎలా వచ్చారు?” అది ట్రైలర్‌లో మెయిన్ సస్పెన్స్. ఈ ఇంట్రోకే goosebumps వస్తే, అసలైన హారర్ ఇంకా మిగిలే ఉంది!
ఇటీవల ఓపెన్‌హైమర్‌తో ఆస్కార్ గెలిచిన అతడు, ఇప్పుడు భయంకరమైన పాత్రలో తనను తాను మళ్ళీ కొత్తగా కనిపించబోతున్నాడు.