అనన్య పాండే – గ్లామర్‌కే కాదు, నటనకూ న్యాయం చేసే నటి అని నిరూపించుకుంటోంది! రీసెంట్ గా అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘కేసరి 2’ లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసినవాళ్లంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. గతంలో “నటనరాదంటూ” విమర్శించినవాళ్లే ఇప్పుడు ఆమె నటనపై ఫిదా అయ్యారంటే… ఈ మార్పు మాటల్లో చెప్పలేనిది.

ఇదే టైంలో మరో క్రేజీ న్యూస్… అనన్య ఇప్పుడు సౌత్‌లో కూడా తన మార్క్ వేసేందుకు రెడీ అవుతోంది! అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే క్రేజీ ప్రాజెక్ట్‌‌లో అనన్య నటించబోతోందని సమాచారం. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌‌ పిక్చర్స్‌‌ సంస్థ హ్యూజ్‌‌ బడ్జెట్‌‌తో నిర్మిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే భారీ సినిమా కోసం అనన్య పాండే కాస్ట్ అయ్యిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉంది సన్ పిక్చర్స్ – అప్పుడే ఎనౌన్స్‌మెంట్ వీడియోతో హైప్‌ని క్రియేట్ చేసింది.

రూ.600 కోట్ల బడ్జెట్ – బన్నీ డ్యూయల్ రోల్?

పలు అంతర్జాతీయ గ్రాఫిక్స్ కంపెనీలు ఈ సినిమాపై పనిచేస్తున్నాయంటే, విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా, బన్నీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటూ వినిపిస్తున్న రూమర్స్ నిజమైతే… ఫ్యాన్స్‌కు ఇది డబుల్ థమాకానే!

ఈ ప్రాజెక్ట్‌కి హీరో, దర్శకుడు పారితోషికం కలిపితే సుమారు రూ.250 కోట్లు అని సమాచారం.

, ,
You may also like
Latest Posts from