రవి మోహన్, ఆర్తి మధ్య విడాకుల కేసు గత కొంతకాలంగా ఇంట్రస్టింగ్ గా మారింది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతున్న వారి వివాదాలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బుధవారం, దంపతులు వారి పిటిషన్లు సమర్పించడానికి చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు హాజరయ్యారు.
అటువంటి పరిస్థితుల్లో, సుమారు 15 సంవత్సరాల పాటు కొనసాగిన వారి వివాహ బంధానికి వీడ్కోలు పలికినట్లైంది. రిపోర్ట్ ల ప్రకారం, ఈ విడాకుల కేసు జూన్ 12కి వాయిదా వేసి విచారణ కొనసాగనుంది. ఆర్తి ఈ కేసులో నటుడు రవి మోహన్ నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం అడిగింది.ఈ విషయం చాలామందిని ఆశ్చర్యానికి లోను చేసింది. కోర్టు తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.
గత ఏడాది జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆర్తి అతడు తనతో చర్చించకుండానే విడాకుల విషయాన్ని బయటపెట్టినట్లు విమర్శించింది.
అలాగే, జయం రవి గాయని కెనీషాతో స్నేహపూర్వకంగా ఉన్న కారణంగా విడాకులు కోరుతున్నట్లు కొలీవుడ్ వార్తలు వెలువడాయి. ఇటీవల జరిగిన ఒక వేడుకలో జయం రవి, కెనీషా కలిసి హాజరైన విషయం కూడా చర్చనీయాంశమైంది.
ఇక ఆర్తి సోషల్ మీడియాలో 18 ఏళ్ల పాటు జీవిత భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తన బాధ్యతలను మరిచిపోయినట్లు చెప్పి పిల్లల కోసం తన పోరాటం కొనసాగుతోందని వెల్లడించింది. ఇక జయం రవి ఒక ప్రకటన విడుదల చేసి, ఆర్తి తనను నైతికంగా, ఆర్థికంగా నియంత్రించడంపై ఆరోపణలు చేశాడు.
జయం రవి వ్యాఖ్యలపై ఆర్తి మరోసారి స్పందిస్తూ, వారి వేరు కావడానికి ఒకే వ్యక్తి కారణమని, తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పింది. ఇకపై న్యాయస్థానంపై నమ్మకం ఉన్నందున, తన నుండి మరింత వ్యాఖ్యలు రావు అని స్పష్టం చేసింది.
ఈ విడాకుల కేసు ఇంకా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఈ కుటుంబం మధ్య తగాదాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి.