‘పెళ్లిసందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన శ్రీలీల… ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి. చీరకట్టు చందమామలా తెరపై మెరిసిన ఆమెకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువైనా… క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది శ్రీలీల.
ఇప్పుడు ఆమె క్రేజ్ ఓ లెవెల్లో ఉంది. బాలీవుడ్ నుండి కూడా భారీగా ఆఫర్లు వస్తుండటంతో… remunerationలో ఆమె చేస్తున్న డిమాండ్ టాలీవుడ్‌ను షాక్‌కు గురిచేస్తోంది.
శ్రీలీల డిమాండ్ ఎంతంటే…
ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం… శ్రీలీల ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తోందట!
ఈ డిమాండ్ తెలుగులో ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయనంతటి రేంజ్ లో ఉంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్లు అయితే ఆమెకు ఈ మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఆమె ముంబైలో ఎక్కువగా కనిపించటం, హిందీ ప్రాజెక్ట్స్‌కే ఎక్కువ టైమ్ కేటాయించడమే ఇందుకు నిదర్శనం.
ఆషికీ 3 తో బాలీవుడ్ స్థిరపడాలన్న డ్రీమ్
కార్తిక్ ఆర్యన్ సరసన శ్రీలీల “ఆషికీ 3” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తన బాలీవుడ్ కెరియర్ను బలంగా నిలబెడుతుందనే నమ్మకంతో ఉంది. అందుకే, ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
కానీ… ఇది సరైన టైమా?
ఇప్పటివరకు పెద్దగా హిట్స్ లేకుండా, భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం శ్రీలీలకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నదానిపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చేంతగా ముందుకు రావడం లేదు.
స్టార్డమ్ కు సరైన పంథా అవసరం
తెలుగులో అవకాశాలు నిలబెట్టుకుంటూనే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఎంచుకుంటే శ్రీలీలకి సేఫ్ గేమ్ అయ్యేదే. కానీ ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచి, బాలీవుడ్‌కి మౌవ్ కావడం… రిస్క్ ఫ్యాక్టర్ అంటున్నారు పరిశ్రమ వర్గాలు.
ఫైనల్ గా చెప్పాలంటే…
శ్రీలీలకి ప్రస్తుతం క్రేజ్ ఉందనేది నిజం. కానీ ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే తెలివితేటలు, టైమింగ్, బ్యాలెన్స్ అవసరం. లేదంటే టాలీవుడ్, బాలీవుడ్ రెండింటినీ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.