రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమాకి మూడున్నర దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ మైలురాయి సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మిలీగా మన హృదయాల్లో ముద్ర వేసుకున్న ఉర్మిళా మటోండ్కర్ మరోసారి ఆ మ్యాజిక్‌ను తిరిగి చూపించింది.

51 ఏళ్ల వయసులోనూ, యంగ్ స్టార్‌లా మెరిసిపోతూ బ్లూ పొల్కా డాట్ గౌన్‌లో, ‘రంగీలా రే’ పాటకి డాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతూ, “ఇంత టైమ్‌లెస్‌గా ఎవరు ఉంటారు?” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఉర్మిళ తన హృదయాన్ని తాకే నోట్‌లో ఇలా రాసింది:

“రంగీలా… అది కేవలం సినిమా కాదు… అది ఒక ఫీలింగ్. ఆనందం, ఆశలు, కలలు, అంబిషన్, అందం, ప్రేమ, పోరాటం, విజయం, త్యాగం – జీవితం అనే వేడుక మొత్తాన్ని కలిపిన ఓ కాన్వాస్ లాంటిది. ప్రతి సీన్ కూడా మనల్ని బాల్యపు అమాయకమైన ఆనందంలోకి తీసుకెళ్తుంది.”

సోషియల్ మీడియాలో ఆమె డాన్స్ క్షణాల్లో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమె ఎనర్జీ, ఎలిగెన్స్‌కి మైమరచిపోతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial)

1995లో విడుదలైన రంగీలా – ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఉర్మిళ త్రయం చేసిన ఈ చిత్రం…
ఏ.ఆర్. రెహమాన్‌కి బాలీవుడ్‌లో లెజెండరీ స్టేటస్ ఇచ్చింది.
రామ్ గోపాల్ వర్మకి అతిపెద్ద హిట్స్‌లో ఒకటైంది.
ఉర్మిళకి అయితే కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది.

మూడున్నర దశాబ్దాలు గడిచినా ‘రంగీలా రే’ మ్యూజిక్, ఉర్మిళ గ్లామర్, సినిమా ఎనర్జీ – ఇవన్నీ ఈరోజు కూడా మనసులు దోచేస్తున్నాయి!

, , , , ,
You may also like
Latest Posts from