

‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా అలరించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, తొలిసారిగా తన కెరీర్‌లో దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అవును.. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 లో మహేష్ బాబు శ్రీరాముడి అవతారం ఎత్తనున్నారని టాలీవుడ్ టాక్!
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, “సినిమాలోని కీలక ఎపిసోడ్‌లో మహేష్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారు. సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న ఈ పీరియాడిక్ సీక్వెన్స్ ప్రేక్షకులను శతాబ్దాల క్రితం కాలానికి తీసుకెళ్లి, రాక్షసులను ఛేదించే దృశ్యాలతో గూస్‌బంప్స్ రేపుతుంది. ఇది మహేష్ కెరీర్‌లోనే లార్జర్ దాన్ లైఫ్ అనిపించే ఎపిసోడ్ అవుతుంది” అంటున్నారు.
రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌లో పురాణ గాధల్ని ఇప్పటి గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్‌తో మేళవిస్తున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్, కీలక పాత్రలో ఆర్. మాధవన్ ఇప్పటికే ఖరారయ్యారు.
వార్నర్ బ్రదర్స్‌తో చర్చలు
నెట్‌ఫ్లిక్స్ భారీ సపోర్ట్
బాలీవుడ్, హాలీవుడ్‌లో మహేష్ బాబు సిమల్టేనియస్ డెబ్యూ
ఇంటర్నేషనల్ లొకేషన్స్, హైదరాబాద్‌లో సెట్‌లపై చిత్రీకరణ జరుగుతోంది. ఈ భారీ మాగ్నమ్ ఓపస్ 2026 అక్టోబర్ లో రిలీజ్ అవ్వాలని రాజమౌళి లక్ష్యం పెట్టుకున్నారట.
“మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ గ్లోబల్ లెవల్‌లో ఇప్పటికే హడావుడి రేపింది. ఇండియన్ మైథాలజీని ప్రపంచానికి చూపించాలనేది రాజమౌళి లక్ష్యం” అని చెప్తున్నారు.
ఇదే నిజమైతే మహేష్ బాబు కూడా ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్ తరహాలో శ్రీరాముడి పాత్ర పోషించే స్టార్‌ల జాబితాలో చేరబోతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ ‘రామాయణం’లో శ్రీరాముడి అవతారంలో నటిస్తున్నారు.