
2022లో విడుదలైన కాంతార గురించి మొదట నార్త్ ఆడియెన్స్‌కి ఎలాంటి ఐడియా లేదు. హీరో రిషబ్ శెట్టి పేరు కూడా తెలియదు, భూతకోలా అనే ఆచారం ఏమిటో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ రిషబ్ శెట్టి దైవ పాత్రలో చూపించిన పవర్‌ఫుల్ నటన, తర్వాత ఆయనకు తెచ్చిన నేషనల్ అవార్డు, అలాగే వైరల్ అయిన “వరాహరూపం” పాట… ఇవన్నీ కలిసి ఆ సినిమాను హిందీ మార్కెట్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
హిందీ డబ్ వర్షన్ మొదటి రోజు కేవలం రూ.1 కోటి ఓపెనింగ్‌తో మొదలై, చివరికి ఇండియాలోనే రూ.82 కోట్లు వసూలు చేసింది. ఈ అద్భుత విజయం వల్లే ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార: చాప్టర్ 1 మీద అంచనాలు ఆకాశాన్నంటాయి.
అక్టోబర్ 2, 2025 రిలీజ్ కోసం రెడీ అవుతున్న ఈ సినిమాకి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా… షాకింగ్‌గా నార్త్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయని ట్రేడ్ టాక్. అసలు మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ రేంజ్‌కి వెళ్లిన తర్వాత, నార్త్ మార్కెట్‌లో ఈ సారి కనీసం రూ.10–15 కోట్లు ఓపెనింగ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ప్రస్తుత ట్రెండ్ మాత్రం ఆ అంచనాలకు దూరంగా ఉంది.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ట్రైలర్‌కి వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ఇప్పుడు బుకింగ్స్‌పై ప్రభావం చూపుతుందా అన్న టెన్షన్ పెరుగుతోంది.
