
‘ఆర్య’ నుంచి ‘పుష్పా’ వరకూ – ఎక్కడ సుకుమార్ అనే పేరు వింటారో, అక్కడే థియేటర్లలో జనం క్యూ కడతారు. ఆయన సినిమాలు కేవలం కథలు కాదు, ఫీలింగ్స్, ఫ్రెష్‌నెస్, ఫిలాసఫీ కలగలిపిన మైండ్ బ్లాస్టింగ్ అనుభవాలు. అందుకే సుకుమార్ పేరు ఉన్నా సరే, సినిమా అంటేనే ఓ ట్రేడ్ మార్క్ హిట్ అనే నమ్మకం ఇండస్ట్రీకి, ఫ్యాన్స్‌కి ఉంది. ఇక ఇప్పుడు, ఆ పేరు వెనక ఉన్న కుటుంబం నుంచే వస్తోంది ఒక కొత్త సెన్సేషన్
టాప్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ స్వంత బ్యానర్ “Tabitha Sukumar Films” తో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు.
ఆమె తొలి ప్రాజెక్ట్?
2015లో సంచలనం సృష్టించిన ‘కుమారి 21F’ కు సీక్వెల్ — ‘కుమారి 22F’!
ఒరిజినల్ సినిమాలో రాజ్ తరుణ్ – హెబా పటేల్ కెమిస్ట్రీ బాక్సాఫీస్‌ని ఊపేసింది. సుకుమార్ రాసిన ఆ కథలో ప్రేమ, నమ్మకం, సమాజపు తీర్పులు, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి బోల్డ్ థీమ్‌లు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అదే ప్రపంచాన్ని తబిత సుకుమార్ కొత్త కోణంలో చూపించబోతున్నారు.
గత జూలైలో తబిత ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాకు ప్రెజెంటర్‌గా పనిచేశారు. ఇక వారి కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి, ‘గాంధీ తాత చెట్టు’తో నేషనల్ అవార్డు గెలుచుకుంది
ఇక ఇప్పుడు ‘కుమారి 22F’ తో, సుకుమార్ కుటుంబం మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లోకి! ఈ సీక్వెల్లో కొత్త ‘కుమారి’ ఎవరు? కథ ఎటు మలుపు తిరుగుతుంది? ఇప్పటికే సినీ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్
