సినిమా వార్తలు

విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫిక్స్… డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు!

వరుసగా వచ్చిన ఫ్లాప్స్‌తో విశ్వక్ సేన్ కెరీర్‌పై ప్రశ్నలు రావడం మొదలైంది. కానీ ఆగిపోయే టైపు కాదు అతను. “ఫంకీ”తో మళ్లీ గేమ్ మార్చబోతున్నాడు. ఇక ఇప్పుడు అతను ఓకే చేసిన కొత్త సినిమా టాలీవుడ్‌లో పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది.

అందరూ “విశ్వక్ తర్వాత ఎవరి సినిమా?” అని గుసగుసలు మాట్లాడుతుండగా… ఇండస్ట్రీలోనుంచి బయటకు వచ్చిన సమాచారం

విశ్వక్ సేన్ నెక్స్ట్ ఫిల్మ్‌కు ‘శ్రీకారం’ డైరెక్టర్ కిషోర్ రెడ్డి

అవును, శర్వానంద్‌తో ‘శ్రీకారం’ తీసిన కిషోర్ రెడ్డితో విశ్వక్ చేతులు కలిపాడు. ఈ కాంబినేషన్ ఎవరూ ఊహించలేదు — అందుకే ఇప్పుడు హీట్ పీక్‌లో ఉంది.

సినిమా పూర్తిగా ఎమోషన్ + రియలిస్టిక్ ట్రీట్మెంట్ + మాస్ ట్రాక్ కలిపిన కంటెంట్ తో ఉండబోతోందని తెలుస్తోంది. విశ్వక్ స్క్రిప్ట్ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం కిషోర్ రెడ్డి ఫైనల్ స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్? ఫైనల్ నరేషన్ తర్వాత అధికారికంగా వెల్లడిస్తారు.

Similar Posts