సినిమా వార్తలు

షాకింగ్ గా ఉంది కదూ: రమ్యకృష్ణన్‌కి RGV ఇచ్చిన వైల్డ్ లుక్!

లాంగ్ గ్యాప్ తర్వాత మావెరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మళ్లీ డైరెక్షన్‌కి రీఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో తీస్తున్న కొత్త హారర్ థ్రిల్లర్ “Police Station Mein Bhoot” షూట్ స్టార్ట్ చేశారు. ఇది ఆయన కల్ట్ హిట్ “Bhoot” కు స్పిరిచువల్ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

ముఖ్య పాత్రల్లో మనోజ్‌ బాజ్‌పేయీ, జెనీలియా నటిస్తుండగా, ఓ పవర్‌ఫుల్ రోల్‌లో రమ్యకృష్ణన్ దర్శనమిస్తోంది. ఇటీవల చాలా సినిమాల్లో ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్లకు తల్లిగా కనిపించిన రమ్యకృష్ణన్ ఈసారి పూర్తిగా రివర్స్‌ మోడ్‌లోకి వెళ్లింది. ‘శివగామి’గా దూకుడు ఏంటో చూపించిన ఆమె… ఇప్పుడు RGV చేతిలో మళ్లీ హద్దులు చెరిపేస్తోంది.

సిగరెట్ చేతిలో, బ్రేడ్స్, టాటూలు, స్లీవ్‌లెస్ లుక్‌తో కుర్చీలో కూల్‌గా కూర్చుని… రమ్యకృష్ణన్ లుక్ హాలివుడ్ రైవల్‌గా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

RGV కూడా క్లారిటీ ఇచ్చాడు – “ఇది ఘోస్ట్ లుక్ కాదు!” అంటే… ఈ క్యారెక్టర్‌లో ఇంకా ఏం కిక్ ఉండబోతోందో ఊహించండి!

ఇంతకాలం ‘అమ్మ’గా చూసిన రమ్య… ఇప్పుడు డేంజరస్ డివా! RGV స్టైల్ మేకోవర్‌తో రాత్రి రాత్రే సోషల్ మీడియాలో ఫైర్!

Similar Posts