ఎన్టీఆర్ తన లేటెస్ట్ హిట్ దేవర తర్వాత స్పీడు పెంచారు. వరస ప్రాజెక్టులు చేద్దామని పరుగెడుతున్నాడు. అందుకు తగ్గ ప్లాన్స్ వేసుకున్నాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్లు ఇప్పుడు ఎన్టీఆర్ డైలమోలో పడ్డారు. అందుకు కారణం వార్ 2 చిత్రం షూటింగ్ అర్దాంతరంగా ఆగటమే. దాంతో ఎన్టీఆర్ డేట్స్ ఇబ్బందిలో పడ్డాయి. తను కొద్ది కాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. అసలేం జరిగింది

“వార్ 2” టీమ్ రీసెంట్ గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై ఒక డ్యాన్స్ సీక్వెన్స్ తీయడం మొదలుపెట్టింది. అయితే ఊహించని విధంగ ఈ పాట కోసం హృతిక్ రిహార్సల్ చేస్తుండగా కాలు బెణికింది. దాంతో, డాక్టర్లు హృతిక్ ని 6 వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారట. దాంతో, షూటింగ్ ని ఆపేశారు. ఇక్కడే ఎన్టీఆర్ కు ట్విస్ట్ పడింది.

వార్ 2 చిత్రం షూటింగ్ పూర్తి చేసి.. వెంటనే డైరక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా మొదలుపెడుదామని అనుకున్నాడు. అందుకు తగ్గట్లే ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు “వార్ 2” నెల, రెండు నెలల పాటు షూటింగ్ లేకుండా నిలిచిపోవడంతో ఎన్టీఆర్ కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందని సమాచారం.

ఇప్పుటికిప్పుడు ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి తెచ్చి షూటింగ్ మొదలెడదమా లేక రెండు నెలలు ఆగి “వార్ 2” పూర్తి చేసి .. ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చెయ్యడమా అనేది తేల్చుకోలేకపోతున్నాడట ఎన్టీఆర్.

ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే అటు వార్ 2 షూటింగ్ కు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కు బ్రేక్ వస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 2026లో విడుదల చెయ్యాలని ప్లాన్. అలా అయితే మాత్రం ఎన్ఠీఆర్ ఇప్పటి నుంచే షూటింగ్ మొదలు పెట్టాలి. మరి ఎన్టీఆర్ ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

“వార్ 2” సినిమాని ఈ ఏడాది ఆగస్టులో విడుదల ప్లాన్ చేసారు. దాన్ని ఆపటానికి లేదు.

, ,
You may also like
Latest Posts from