
రవితేజ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఇంత తక్కువా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
మాస్ మహారాజా రవితేజకు వరుస పరాజయాలు తలెత్తుతున్నాయి. తాజాగా వచ్చిన మాస్ జాతర కూడా బాక్సాఫీస్ వద్ద అసలు వర్కవుట్ కాకపోవడంతో, ఆయన తదుపరి చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW) పై ఇండస్ట్రీ దృష్టంతా చేరింది.
సంక్రాంతి 2026కి భారీ పోటీ ఉన్నా… ఈ సినిమాను అదే రోజున రీలీజ్ చేయాలని మేకర్స్ పక్కాగా నిర్ణయించేశారు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీసింది.
రీజనబుల్ డీల్స్… లేక ఆవశ్యకమా?
టీమ్ ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లకు చాలా రీజనబుల్ రేట్స్ కు సినిమా ఇవ్వడానికి ముందొస్తున్నట్టు టాక్.
✔ ఆంధ్రా 6 ఏరియాస్ బిజినెస్ – 8 కోట్లు (రేషియో)
✔ మొత్తం థియేట్రికల్ వ్యాల్యూ – దాదాపు 20 కోట్లు
సంక్రాంతి సీజన్‌కి ఇది చాలా ఫెయిర్ బిజినెస్ గానే అనిపిస్తున్నా… సమస్య మాత్రం థియేటర్లు దొరకడమే! ఎందుకంటే అదే టైంలో చిరంజీవి, ప్రభాస్, విజయ్, శివకార్తికేయన్ వంటి పెద్ద సినిమాలు రేస్‌లోకి వస్తున్నాయి.
మొత్తం గేమ్ ఎక్కడ తిరుగుతుంది?
చివరికి అన్నీ సినిమా కంటెంట్‌పైనే ఆధారపడతాయి. ఇప్పటివరకు వచ్చిన BMW టీజర్ మాత్రం— రవితేజ నుంచి పూర్తిగా ఫ్రెష్ వైబ్, ప్రామిసింగ్ ఫీల్ ఇవ్వడంతో, హోప్స్ పెరిగాయి.
