మెగాస్టార్ చిరంజీవిని అవమానం చేసింది ఎవరా ? అని అనుకుంటున్నారా?అవును చిరంజీవి వంటి హీరోతో ఎదురు నిలబడి మాట్లాడటమే కరెక్ట్. కానీ అవమానం అంటే అది కలలో కూడా జరిగే పనికాదంటన్నారు. కానీ ఆయన్ని డైరక్ట్ గా ఎవరూ అవమానం చెయ్యలేదు. ఓ బ్లాక్ బస్టర్ సినిమానే చిరుని అవమానంకు గురి చేసేలా చేసింది. ఆ సంఘటన జరిగి 30 ఏళ్ళు అయ్యింది. కానీ ఇప్పటికి ఆ సినిమా ని తలిస్తే బాధకలుగుతుందిట చిరంజీవికి. ఆ సినిమా మరేదో కాదు ‘అల్లుడా మజాకా’.

చిరంజీవి ఓ కామెడీ యాక్షన్ఎంటర్టైనర్ చెయ్యాలనుకున్నారు. అప్పటికి ఓ వెలుగు వెలుగుతున్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana)తో సినిమా ఓకే చేసి చేసారు. పాటలు హిట్, సినిమా బాగా డబ్బులు తెచ్చింది. 1995 ఫిబ్రవరి 25న .. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడా మజాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ చాలా మంది మహిళలు, మహిళా సంఘాల వారు ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపించారు.

ఎందుకంటే ‘అల్లుడా మజాకా’ లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్పోజింగ్ వంటివి శృతిమించింది అనేది గొడవ చేసారు. ఆడవాళ్లను ఈ సినిమాతో అవమానించారు అన్నారు.

ఎంతో గౌరవనీయురాలైన ‘అత్త’ని చాలా తక్కువ చేస్తూ నీచమైన సన్నివేశాలు ఉన్నాయి అని మహిళా సంఘాల వారు రచ్చ రచ్చ చేసారు. అంతేకాదు ఒక సీన్లో అయితే అత్తగారితో పాటు ఆమె ఇద్దరి కూతుర్లపై కూడా అత్యాచారం చేసినట్లు సీన్ ఉంటుంది. దీనికి అయితే మహిళా సంఘాలు హైలెట్ చేసారు.

ఇవన్నీ తెలుసుకుని చిరు బాగా హర్ట్ అయ్యారట. ఇప్పటికీ అంత హిట్ సినిమాని తలుచుకోవటానికి కూడా ఇష్టపడరట. ఆయన ఈ సినిమాతో తన ఇంట్లో కూడా అవమానం గా ఫీలయ్యారట. అదీ విషయం.

ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా ఇవాల్టితో ఆ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

You may also like
Latest Posts from