సినిమా వార్తలు

గబ్బర్ సింగ్ 2.0? — న్యూ ఇయర్ నైట్ పవర్‌స్టార్ సర్‌ప్రైజ్ రెడీ!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఫ్యాన్స్ బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది! “గబ్బర్ సింగ్” తర్వాత మళ్లీ అదే డైరెక్టర్ హరీష్ శంకర్‌తో పవన్ కలయిక అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశమే హద్దు. ఇప్పుడు “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై ఫ్యాన్స్‌లో క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

తాజాగా హరీష్ శంకర్ ఫ్యాన్స్ కోసం ఓ ఎగ్జైటింగ్ అప్‌డేట్ షేర్ చేశాడు. అల్లరి నరేష్ నటించిన “12A రైల్వే కాలనీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ స్టేజ్ మీదే మాట్లాడుతుండగా, యాంకర్ అడిగిన ప్రశ్నతో సీక్రెట్ బయటపడింది — “ఉస్తాద్ భగత్ సింగ్” ఫస్ట్ సాంగ్ ఈ డిసెంబర్‌లోనే రిలీజ్ అవుతుందని ఆయన కన్‌ఫర్మ్ చేశారు!

ఫస్ట్ సాంగ్ డేట్ లాక్ — డిసెంబర్ 31, 2025!

అంటే న్యూ ఇయర్ 2026కి పవర్‌ఫుల్ మ్యూజిక్ బ్లాస్ట్ రెడీ! దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను “న్యూ ఇయర్ ట్రీట్”గా రిలీజ్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది.

పవన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆయన భాగం షూట్ పూర్తయ్యింది. హీరోయిన్‌లుగా రాశీఖన్నా, శ్రీలీల లు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను సమ్మర్ హాలిడే సీజన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ — “ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ఫెస్టివల్ అవుతుంది” అని చెప్పడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

Similar Posts