
“ముందు ఆ నిర్మాతను ఎన్కౌంటర్ చేయండి!” : ఐబొమ్మ రవి తండ్రి!
విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చిన ఐబొమ్మ రవి తండ్రి చిన్న అప్పారావు.. నిర్మాత సి.కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. పైరసీ కేసులో రవిని “ఎన్కౌంటర్ చేయాలి” అని కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అప్పారావు ఘాటుగా స్పందించారు.
“కల్యాణ్ చెప్పినట్టే పోలీసులు రవిని ఎన్కౌంటర్ చేస్తే… ఈ దేశంలో చట్టాలు ఎందుకు?” అంటూ అప్పారావు కెమెరాల ముందే ఉగ్రరూపం దాల్చారు.
అక్కడితో ఆగకుండా—
“అసలు సినిమా పైరసీ ఎందుకు వచ్చింది? ప్రజలు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ముందు అవే ఆలోచించాలి” అని నిర్మాతనే ప్రశ్నించేశారు.
“నిర్మాతను ఎన్కౌంటర్ చేస్తే… అసలు బాధ ఏంటో తెలుస్తుంది!” – అప్పారావు షాకింగ్ స్టేట్మెంట్
టికెట్ ధరల పెరుగుదలపై కూడా అప్పారావు సెటైర్ వేశారు:
“నేను 45 పైసలతో సినిమా చూశా… ఇప్పుడు టికెట్లు ఒంటి చేత్తో కొనలేని స్థితి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీయమన్నది ఎవరు?” అని ఫిల్మ్ ఇండస్ట్రీనే ధిక్కరించారు.
తన కొడుకు తరఫున న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తానని, చట్టపరంగానే పోరాడుతామని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరో వైపు… సీవీఎల్ నరసింహారావు నుంచి ట్విస్ట్
నటుడు–నిర్మాత సీవీఎల్ నరసింహారావు మాత్రం విభిన్న వ్యాఖ్యలు చేశారు.
“టికెట్లు, స్నాక్స్ ఖర్చులు భరించలేని వారికి సినిమాలు అందుబాటులోకి తెచ్చాడు రవి… అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్” అని పేర్కొన్నారు.
అంతేకాక—
“ఇలాంటి టెక్నికల్ స్కిల్ ఉన్న వాళ్లను పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయాలి” అంటూ సంచలన సలహా ఇచ్చారు.
ఇండస్ట్రీలో కలకలం – ‘ఎన్కౌంటర్’ మాటలపై హీట్ పెరుగుతోంది!
సి.కల్యాణ్ చేసిన “వెయ్యి కోట్ల నష్టం… వీళ్ళను ఎన్కౌంటర్ చేయాలి” వ్యాఖ్యల తర్వాత— రవి తండ్రి ఇచ్చిన ఈ కౌంటర్ రిప్లైతో కేసు చుట్టూ రాజకీయ–సినీ వాతావరణం మళ్లీ వేడెక్కింది.
ఈ వివాదం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి!
