
ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా… ‘ఫ్యామిలీ మాన్ 3’ ను టారెంట్లోనే చూస్తున్నారా? షాకింగ్ రీజన్ !
ప్రైమ్ వీడియోలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యామిలీ మాన్ 3… ఇప్పుడు పూర్తిగా మరో కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. సీజన్ క్వాలిటీపై మిశ్రమ స్పందనలు ఉన్నా, అసలు బ్లాస్ట్ మాత్రం ప్రైమ్ వీడియో పక్కా పెట్టిన వరుస యాడ్స్ మీదే. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ఎపిసోడ్ మధ్యలో వచ్చే యాడ్స్ వల్ల విసిగిపోయిన ప్రేక్షకులు, షాకింగ్‌గా… టారెంట్స్ వైపు తిరిగి చూస్తున్నారని సోషల్ మీడియాలో చెబుతున్నారు. స్ట్రీమింగ్ యాప్‌ల వల్ల తగ్గిన పైరసీని, మళ్లీ ప్రైమ్ వీడియోనే బ్రతికిస్తోంది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది.
‘ది ఫ్యామిలీ మాన్ 3’ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నా… సీజన్‌పై ప్రేక్షకుల్లో పెద్దగా హైప్ కనబడట్లేదు. ముందరి రెండు సీజన్లు ఇచ్చిన లెవల్ ఇంపాక్ట్ ఈసారి లేకపోవడంతో చాలామంది ఇప్పటికే డిసప్పాయింట్ అయ్యారు.
అలాగే ఎపిసోడ్ మధ్యలో వరుసగా వచ్చే ప్రకటనలు చాలామందిని చిరాకు పట్టించాయి. “ఇంత యాడ్స్ ఉంటే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎందుకు?” అని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ప్రైమ్ వీడియోపై ఇదే విషయం మీద ఇంతకు ముందే విమర్శలు వచ్చాయి… ఇప్పుడు ఫ్యామిలీ మాన్ 3తో అసహనం మరింత పెరిగింది.
దాంతో ఆశ్చర్యకరంగా…
సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లే టారెంట్స్‌కి వెళ్లిపోతున్నారు!
ఒక యూజర్ చెప్పినదేమంటే—
“నేను ప్రైమ్‌కి డబ్బు కట్టా… కానీ యాడ్స్‌తో చూడలేక చివరకు టారెంట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా.”
మరొకరు నేరుగా ఫైర్ అయ్యారు—
“ఇలాగే యాడ్స్ పెడితే మళ్లీ పైరసీకి వాళ్లే దారి చూపిస్తున్నారు.”
కొంతమంది షోలోని కొన్ని ఎపిసోడ్‌లు నచ్చినా, యాడ్స్ మొత్తం ఫ్లోనే చెడగొట్టాయని అంటున్నారు. “సీన్ టెన్షన్ పెరిగిన టైంలో యాడ్స్ వచ్చేస్తే మూడే మిస్సవుతోంది” అని కామెంట్ చేస్తున్నారు.
ప్రైమ్ వీడియో గతంలో కూడా యాడ్స్ విషయంలో ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడు ఫ్యామిలీ మాన్ 3తో ఆ విమర్శలు మళ్లీ ఊపందుకున్నాయి.
ప్రేక్షకులు ఒక్క మాటే అంటున్నారు—
“యాడ్ స్ట్రాటజీ మార్చకపోతే… టారెంట్‌లే మళ్లీ ‘మెయిన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్’ అవుతాయి.”
