
నాగ చైతన్య ‘వృషకర్మ’ కి షాకింగ్ బడ్జెట్ ? ఇంక బిజినెస్ ఎంత చేస్తారో
అక్కినేని నాగ చైతన్య ఈసారి చిన్న టార్గెట్లతో కాదు… నేరుగా భారీ గేమ్ లోకే అడుగుపెడుతున్నాడు! ‘థండేల్’ తరువాత ఆయన పూర్తి ఫోకస్ మిస్టిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ పైనే. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే టాప్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే—ఇదే చైతు కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన కాస్ట్లియెస్ట్ ఫిల్మ్ అవుతోంది.
100 కోట్ల మార్క్‌ను దాటే మెగా బడ్జెట్!
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ డండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడట్లేదు. భారీ సెట్ల నిర్మాణం, టాప్ టెక్నీషియన్స్, భారీ షెడ్యూళ్లతో ఫైనల్ బడ్జెట్ Rs.100 Cr+ కి చేరుతుందని ఇండస్ట్రీ టాక్.
థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ డీల్స్ ఇంకా ఓపెన్!
అత్యద్భుత నమ్మకంతో ఉన్న ప్రొడ్యూసర్స్ ప్రస్తుతం ఎలాంటి డీల్ కూడా క్లోజ్ చేయలేదు. “కంటెంట్ స్ట్రాంగ్…అందుకే మార్కెట్ విషయంలో థీమా” అన్న కాన్ఫిడెన్స్‌తో స్లో అండ్ స్టెడీగా ముందుకు వెళ్తున్నారు.
చైతు ఫుల్ కమిట్‌మెంట్… కొత్త సినిమాలకు బ్రేక్!
‘వృషకర్మ’ మీదే పూర్తిగా కేంద్రీకరణ చేయడం కోసం నాగ చైతన్య ఇతర ప్రాజెక్ట్స్ అన్నింటినీ హోల్డ్‌లో పెట్టేశాడు. సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.
సమ్మర్ 2026 – భారీ రిలీజ్ ప్లాన్!
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు బివీఎస్ఎన్ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమ్మర్ 2026 నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ప్లాన్.
ఇండస్ట్రీలో ఒక్క మాట… ‘వృషకర్మ’ టార్గెట్స్ నిజంగా బిగ్గర్!
చైతు కెరీర్‌లోనే మోస్ట్ అంబీషస్ మూవీగా మారుతున్న ‘వృషకర్మ’ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చగా నిలిచింది. భారీ బడ్జెట్, మిస్టిక్ టోన్, ‘విరూపాక్ష’ డైరెక్టర్ క్రేజ్ అన్నీ ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తున్నాయి.
ఇంకా షూటింగ్ కొనసాగుతుండగానే… “వృషకర్మ ఎంత పెద్ద హిట్ కొడుతుంది?” అనే ప్రశ్న ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
మిథికల్ థ్రిల్లర్ కథతో, కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సుకుమార్.బి నిర్మాతలు. బాపినీడు సమర్పకులు. ‘లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రం కోసం నాగచైతన్య శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమై నటిస్తున్నారు. ఆయనొక నిధి అన్వేషకుడిగా, గాఢతతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ‘‘విజయవంతమైన ‘విరూపాక్ష’ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు పురాణాల్ని, చరిత్రని మేళవించి భారీ హంగులతో రూపొందిస్తున్న చిత్రమిది.
నాగచైతన్య ఇంతకుముందు ఎప్పుడూ లేని రీతిలో ఓ కొత్త రకమైన లుక్‌లో కనిపించనున్నార’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి సంగీతం: అజనీశ్ బి.లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: రాగుల్ డి.హెచియన్, ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగాల, కూర్పు: నవీన్‌నూలి.
