సినిమా వార్తలు

‘హనుమాన్’ డైరక్టర్ సంచలన నిర్ణయం, ఇండస్ట్రీ షాక్

‘హనుమాన్’ (2024)తో ఇండియన్ సినీ మార్కెట్‌ను షేక్ చేసిన యంగ్ డైరెక్టర్ ప్రసాంత్ వర్మకి ఆ తర్వాత జరిగిందేమిటో అందరికీ తెలుసు.. ఆగిపోయిన ప్రాజెక్టులు… ఫైనాన్షియల్ ఇష్యూస్… నెల‌ల కొద్దీ అయోమయం.

తాజాగా Waves Film Bazaar – Knowledge Seriesలో పాల్గొన్న ప్రసాంత్ వర్మ, తన గత తప్పిదాలపై ఓపెన్‌గా మాట్లాడాడు. అతను తాను నేర్చుకున్న అతి పెద్ద పాఠాన్ని బయటపెట్టాడు.

“ఎలాంటి సినిమా చేసినా… రిలీజ్‌ డేట్‌ ఫైనల్ చేసే హక్కు నాదే!”

గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల వల్ల, ఇకపై ఎలాంటి సినిమా సైన్ చేసినా ప్రొడ్యూసర్లతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంటానన్నారు ప్రశాంత్.
దానికి కారణం?

“షూట్ పూర్తయిన తర్వాత సినిమా ‘పక్కా కుక్‌’ అవ్వాలి. హడావుడిగా రిలీజ్ పెట్టే కాలం అయిపోయింది. టైమింగ్ తప్పితే సినిమా విలువ పోతుంది.” అంటూ క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

హనుమాన్ సక్సెస్ తర్వాత వచ్చిన కష్టాలు… ఇప్పుడు నెక్స్ట్ మూవ్ రెడీ!

‘హనుమాన్’ తర్వాత వరుస కమిట్‌మెంట్‌లు ఉన్నా, అనేక ప్రాజెక్టులు స్టక్ అయ్యాయి లేదా ఆపేయక తప్పలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఫుల్ ఫోకస్‌తో తన తదుపరి సినిమా “జై హనుమాన్” మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

హీరో: రిషభ్ శెట్టి

స్కేలు: భారీ

టార్గెట్ రిలీజ్: 2026 ప్రారంభం

Similar Posts