2024 సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయ్యింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అయితే తల్లి, కొడుకు సెంటిమెంట్‌తో వచ్చిన గుంటూరు కారం సినిమాకి తమన్ ఇచ్చిన సంగీతం ప్లస్‌గా నిలిచింది. సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ పాటను అత్యధికులు చూశారు.
ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా చూసిన పాటల్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఒకటి అంటూ యూట్యూబ్ అధికారికంగా ఇప్పిటకే ప్రకటించింది. ఇప్పటి వరకూ కుర్చీమడతపెట్టి సాంగ్ యూట్యూబ్‌లో 600 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.
వాస్తవానికి కుర్చీ మడతపెట్టి సాంగ్ మొదట్లో విమర్శలు ఎదుర్కొంది. బూతు పదం, యూత్‌ను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఆ వివాదమే పాటకు కలిసి వచ్చింది.
కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగానూ కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి సెలబ్రెటీలు, సోషల్ మీడియాకి చెందిన వారు డాన్స్ చేశారు. లక్షల మంది కుర్చీ మడత పెట్టి సాంగ్ తో షార్ట్ వీడియోలు చేయడం ద్వారా మరింతగా సాంగ్‌కి పాపులారిటీ దక్కింది.