బాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్‌లో రాజ్‌కుమార్ హిరానీ పేరు టాప్‌లో ఉంటుంది. మున్నా భాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి మైండ్‌బ్లోయింగ్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ లెజెండరీ మేకర్ సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అనేది ఇండస్ట్రీ నమ్మకం. అలాంటి హిరానీతో మరోసారి ఆమిర్ ఖాన్ జట్టు కట్టడం అనేది బిగ్ న్యూస్‌గానే మారింది.

కానీ, షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే… ఆమిర్ ఖాన్ హిరానీ చెప్పిన కొత్త బయోపిక్‌ ( దాదాసాహెబ్ ఫాల్కే కథ ) స్క్రిప్ట్ విన్న తర్వాత కన్‌ఫ్యూజ్ అయిపోయాడట. నేరుగా హిరానీకే “ఇది రీ-రైట్ చేయాలి” అని చెప్పేశాడట. హిరానీ స్టోరీ చెప్పాడంటే ఎవ్వరూ తిరస్కరించరు* అనేది ఇండస్ట్రీలో నమ్మకం. కానీ ఈ సారి ఆమిర్ ఓపెన్‌గా మార్పులు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

అసలు షూట్ అక్టోబర్‌లో మొదలవ్వాల్సింది కానీ ఆమిర్ ఖాన్ డిమాండ్ వల్ల ప్రాజెక్ట్ హోల్డ్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హిరానీ మార్పులు చేసి మళ్లీ ఆమిర్‌కి నేరేట్ చేస్తాడా? లేక ఈ బయోపిక్ కోసం కొత్త హీరోను వెతుకుతాడా? అనే సస్పెన్స్ పెరిగింది.

ఇక మరోవైపు ఆమిర్ ఖాన్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్లాన్ చేసిన సూపర్‌హీరో ప్రాజెక్ట్ కూడా మిస్టీరియస్‌గా షెల్వ్ అయినట్టే. ఫలితంగా “మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్” ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఇంతకీ “ఆమిర్ ఖాన్ డిమాండ్‌కి హిరానీ తలొగ్గుతాడా? లేక కొత్త హీరోతో సర్ప్రైజ్ ఇస్తాడా?”

, , , ,
You may also like
Latest Posts from