బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తాజా సినిమా ‘సితారే జమీన్ పర్’ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఒక డిబేట్‌లో ఆమిర్ ఖాన్ సినీ పరిశ్రమపై పెరిగిన ఓటిటి ప్రాబల్యం వల్ల థియేటర్లకు ఇబ్బంది ఏర్పడుతున్నదని, ఆడియన్స్ థియేటర్లకూ రావటం తగ్గిపోతున్నారని చర్చించారు.
ప్రతి సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కనీసం 8 వారాల మధ్య స్థిరమైన గ్యాప్ అవసరం అని ఆయన సూచించారు. అలాగే, తన ‘సితారే జమీన్ పర్’ సినిమాను కూడా 8 వారాల తర్వాత యూట్యూబ్ లో పేమెంట్ మాదిరిగా (పే-పర్-వ్యూవ్) విడుదల చేస్తానని ప్రకటించారు.
అయితే బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఆమిర్ ఖాన్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చింది. అన్ని భాషల్లో డిజిటల్ రైట్స్ కోసం మొదట రూ. 60 కోట్లు ఆఫర్ చేసింది. అయితే ఆమిర్ ఖాన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రిటైల్‌గా ఆఫర్‌ను రెండింతలు పెంచి రూ. 125 కోట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది. కానీ ఆమిర్ ఖాన్ ఈ భారీ ఆఫర్‌ను అంగీకరిస్తాడా లేదా యూట్యూబ్ రీలీజే చేసుకుంటాడో ఇంకా స్పష్టత లేదు.
‘సితారే జమీన్ పర్’ లో ఆమిర్ ఖాన్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించారు. స్పానిష్ చిత్రం ‘చాంపియన్స్’ కు రీమేక్ అయిన ఈ సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తోంది.
ఈ సినిమా ద్వారా OTT vs థియేటర్ డిబేట్, ఆమిర్ ఖాన్ చూపిస్తున్న స్పష్టమైన దృక్పథం, ప్రేక్షకుల్లో మంచి చర్చ రేకెత్తించే అంశంగా మారింది. సినిమా విడుదలతో పాటు డిజిటల్ ప్లాన్లు కూడా సినిమాకి వ్యాపారంలో కొత్త దిశని ఇస్తున్నాయి.