సినిమా వార్తలు

‘దురంధర్ 2’ ఒక చెత్త సినిమా..డబ్బులు వృధా చేసుకోవద్దు!! స్టార్ హీరోయిన్ సంచలన రివ్యూ

బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల వేట.. కానీ థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల ఓపికకు పరీక్ష! రణవీర్ సింగ్ ‘దురంధర్ 2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటే.. ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఈ సినిమాను “ముగింపు లేని మొండి పాఠ్యపుస్తకం” అంటూ చీల్చి చెండాడారు. అసలు రణవీర్ నటనను ఆమె అంత దారుణంగా ఎందుకు ఎగతాళి చేశారు? ఆ ‘ప్రచార చిత్రం’ వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి?

బాలీవుడ్ మాస్ హీరో రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే 200 కోట్లు కొల్లగొట్టి, లాంగ్ వీకెండ్ నాటికి 500 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ సక్సెస్ వెనుక ఉన్న కంటెంట్‌పై కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సినిమా చూడటం అంటే ప్రేక్షకులకు ఒక “ఎండ్యూరెన్స్ టెస్ట్” అని, థియేటర్లలో విసుగు చెందిన జనం చివరకు అసహనంతో నవ్వుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

ముఖ్యంగా రణవీర్ సింగ్ నటనపై రమ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సినిమాలో రణవీర్ పెర్ఫార్మెన్స్ కంటే ఆయన జుట్టుకే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉందని, దానికి ‘బెస్ట్ సపోర్టింగ్ రోల్’ అవార్డు ఇవ్వొచ్చని ఆమె ఘాటుగా విమర్శించారు. మొదటి భాగంలో ఉన్న ఎనర్జీ, థ్రిల్ ఈ సీక్వెల్‌లో మచ్చుకైనా లేవని, ఇదొక లాజిక్ లేని యాక్షన్ సినిమా అని ఆమె తేల్చి చెప్పారు.

దర్శకుడు ఆదిత్య ధర్ కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికే ఈ ‘పాతకాలపు ప్రచార చిత్రం’ తీశారని, మేకింగ్‌లో క్వాలిటీ పూర్తిగా లోపించిందని రమ్య తన రివ్యూలో పేర్కొన్నారు. వాస్తవానికి దూరంగా ఉన్న యాక్షన్ సీన్లు, ప్రతి వస్తువును ఆయుధంగా మార్చి చూపించడం హాస్యాస్పదంగా ఉందని ఆమె నిప్పులు చెరిగారు. ప్రేక్షకులు తమ విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా ఈ సినిమాను చూడటం మానేయాలని ఆమె గట్టిగా సూచించారు.

రమ్య చేసిన ఈ కామెంట్స్‌పై రణవీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు సినీ విశ్లేషకులు మాత్రం ఆమె మాటల్లో నిజం ఉందంటున్నారు. పొలిటికల్ డిఫరెన్సెస్ వల్లే రమ్య ఇలా మాట్లాడుతోందని కొందరు ఆరోపిస్తున్నా, ‘దురంధర్ 2’ కంటెంట్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. బాక్సాఫీస్ అంకెలు నిజమా లేక ఈ విమర్శలు నిజమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Similar Posts