నాని సినిమాలో ఉంటేనే ఓ స్థాయిలో హైప్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నాని ఎమోషనల్ డ్రామాలకు విభిన్నమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ‘హాయ్ నాన్న’ వంటి సెన్సిటివ్ స్టోరీకి నాని ఇచ్చిన డెప్త్, స్క్రీన్ మీద ప్రేమను చూపించిన తీరు – ఆ సినిమా మంచి సినిమాలా మార్చింది. ఇప్పుడు అదే డైరెక్టర్ శౌర్యతో మళ్లీ నాని సినిమా చేయబోతున్నాడన్న వార్తలు ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని రేపుతున్నాయి.

శౌర్య – నాని కాంబో రీటర్న్స్:

‘హాయ్ నాన్న’తో దర్శకుడిగా పరిచయమైన శౌర్య తన డెబ్యూ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ సినిమా ఓటీటీ వేదికగా కూడా భారీగా ట్రెండ్ కావడం, నెలల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో నిలవడం ఒక చెప్పుకోదగ్గ విషయంగా నిలిచింది.

ఇప్పుడు శౌర్య రాసిన కొత్త స్క్రిప్ట్‌ను నానికి వినిపించగా, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. పూర్తి bound స్క్రిప్ట్ సిద్ధమవగానే సినిమా షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

నాని మేనేజర్ తొలి ప్రయత్నం:

ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే – నానికి ఎన్నో ఏళ్లుగా మేనేజర్‌గా ఉన్న ఎస్. వెంకట్ రత్నం ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారుతున్నారు. నానితో తాను ఓ సినిమా చేయాలని అనుకున్న వెంకట్‌ రత్నంకు నాని ఎప్పుడో హామీ ఇచ్చాడట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఫైనల్‌గా లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం.
ఈ సినిమాను వెంకట్‌తో పాటు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా కలిసి నిర్మించనున్నారు. అధికారిక ప్రకటన వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇతర ప్రాజెక్ట్స్ అప్‌డేట్:

ఇదే సమయంలో నాని ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రం 2026 మేలో విడుదల కానుంది.

దీంతో పాటు సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే శౌర్య సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

, ,
You may also like
Latest Posts from