బాలకృష్ణ ‘అఖండ’ ఫిల్మ్ 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన తర్వాత, అఖండ 2: తాండవం కోసం అభిమానుల్లో ఏ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో చెప్పటం కష్టం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సీక్వెల్ రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు టీజర్ రిలీజ్ తేదీ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి.

ముందుగా ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ, పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన OG సినిమా విడుదలతో క్లాష్ కాకుండా ముందస్తుగా రిలీజ్ వాయిదా వేయాలని టీమ్ నిర్ణయించింది.

ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న అఖండ 2 టీజర్ బాలకృష్ణ పుట్టినరోజు అయిన జూన్ 10న విడుదలవచ్చని సమాచారం వచ్చింది. అదే టీజర్‌లో సినిమా విడుదల తేదీ అధికారికంగా వెల్లడిస్తారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు మొదటి వారంలో విడుదల అవ్వనుందని అంచనా.

అఖండ 1 కూడా డిసెంబరు మొదటి వారంలోనే వచ్చింది, పెద్ద హిట్‌ అయ్యింది. కానీ ప్రబాస్ హీరోగా రాజా సాబ్ చిత్రం కూడా అదే వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే, అఖండ 2కి దారి ఇచ్చేందుకు రాజా సాబ్ సినిమా విడుదల తేదీ వచ్చే సంవత్సరంకు వెళ్తుందో లేదో చూడాలి.

, ,
You may also like
Latest Posts from