
‘అఖండ 2’కి ఓపెనింగ్స్! – సింపతి ఫ్యాక్టర్ కూడా బాలయ్యకు భారీ బూస్ట్!
‘అఖండ 2’ వాయిదా ఫ్యాన్స్‌కి ఒక్క మాటలో భారీ షాక్. ఒక రోజు కాదు… ఒక వారం వరకు సినిమా రాకపోవడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నిరాశ, అసహనం స్పష్టంగా కనిపించాయి. కానీ ఇప్పుడు అదే ఉత్కంఠ, అదే ఆక్రోశం థియేటర్లలో బాక్సాఫీస్ ఫైరుగా మారబోతుంది!
ఒక ఎగ్జిబిటర్ మాటల్లోనే చెప్పాలంటే..
“ఈసారి బాలయ్య సినిమాకి తోడు కోపం కూడా థియేటర్లను నింపేస్తుంది!”
సింపతితో పాటు… బోయపాటి మాస్, భక్తి డోస్ కూడా రెడీ!
వాయిదా ఇష్యూలు, కోర్టు కేసులు అన్నీ క్లియర్ అయ్యాక ‘అఖండ 2’ డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధం. ప్రీమియర్స్ డిసెంబర్ 11 రాత్రే.
ఈసారి హైలైట్లు చాలా:
దైవిక ఎనర్జీ + బోయపాటి మాస్ యాక్షన్
భావోద్వేగం, ముఖ్యంగా అమ్మ భావం – హార్ట్ టచింగ్ ట్రాక్
బాలయ్య మూడు విభిన్న గెట్-అప్స్!
“అన్నీ ఊహించిన దానికంటే పెద్దవే” అని లోపలి టాక్.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అయితే స్కోర్‌తో సినిమా ఎనర్జీని ఇంకా కొత్త లెవెల్‌కు తీసుకెళ్లాడట. సినిమాను 14 రీల్స్ ప్లస్ నిర్మించగా, తేజస్విని నందమూరి సమర్పణలో సినిమా వస్తోంది. సయుక్త, ఆదితో పాటు హర్షాలి మాల్హోత్రా కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
ఓపెనింగ్స్ విషయానికి వస్తే… అఖండ బ్లాస్ట్ గ్యారెంటీ!
ఎగ్జిబిటర్ మాటల్లోనే — “నందమూరి అభిమానులు ఈసారి థియేటర్లను నింపేస్తారు. వాయిదా వల్ల కలిగిన బాధ ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్స్‌గా మారుతుంది.” తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ఉత్తర అమెరికా, విదేశాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ ఆశిస్తున్నారని ట్రేడ్ అంచనా. అన్నీ సరిగ్గా కుదిరితే… ‘అఖండ 2’ బాక్సాఫీస్‌పై అఖండ రాంపేజ్ చూపుతుంది!
