అనుష్క శెట్టి – బాహుబలి తర్వాత తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్రలకి పర్యాయ పదంగా మారిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్‌లలో ఈ మధ్య ఆమె కనిపించకపోయినా, అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాత్రం ఏనాడూ తగ్గలేదు. అలాంటి అనుష్క ఇప్పుడు సౌత్‌లో అత్యంత భారీగా ఎదుగుతున్న ఫ్రాంచైజ్ — Lokesh Cinematic Universe (LCU) లోకి అడుగుపెడుతున్నారన్న వార్తలు ఊపందుకుంటున్నాయి.
‘కూలీ’ తర్వాత ‘ఖైది 2’: లోకేష్ భారీగా ప్లాన్ చేస్తున్న సీక్వెల్
లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, అదే సమయంలో ‘ఖైదీ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించేశారు. కథ, స్క్రిప్ట్ పనులతో పాటు నటీనటుల ఎంపికలో కూడా లాగతీయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అనుష్క శెట్టి పేరు పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.
అనుష్క – గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఊహించగలరా?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అనుష్క ‘ఖైదీ 2’ లో ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ‘భాగమతి’, ‘అరుందతి’, ‘వేదం’ వంటి సినిమాల్లో ఆమె ఇప్పటికే మహిళా ప్రాధాన్య పాత్రలను ఎంత బలంగా నటించగలరో నిరూపించింది. ఆ ఎక్సపీరియన్స్ తో ఆమె ‘ఖైదీ 2’లో కనిపిస్తే, అది సినిమాకే ఓ సడెన్ రైజ్ ఇవ్వగలదు.
డిల్లీ రిటర్న్ తో పాటు అనుష్క సర్ప్రైజ్ ఎంట్రీ?
‘ఖైదీ ’ లో కార్తీ పోషించిన డిల్లీ పాత్ర ఎంతగా పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే, అనుష్క వంటి స్టార్ ఈ యూనివర్స్‌లో అడుగుపెడుతున్నారన్న న్యూస్ సినీ వర్గాల్లో కొత్త ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తోంది.
ఇంకా అధికారిక ప్రకటన లేదుగానీ…
ఇప్పటికైతే అనుష్క టీమ్ ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ, ఇది నిజమైతే మాత్రం ‘ఖైదీ 2’ కి ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవడం ఖాయం.