బాలకృష్ణ కెరీర్‌లో ‘అఖండ’ ఓ టర్నింగ్ పాయింట్ అనే సంగతి తెలిసిందే. సీజన్ కాని టైమ్ లో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేసి షూట్ స్టార్ట్ చేసారు. ‘అఖండ 2’ అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు. ఈ చిత్రం నిమిత్తం బాలయ్య, బోయపాటి భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అఖండ 2 చిత్రం నిమిత్తం బాలయ్యకు 40 నుంచి 45 కోట్లు దాకా పే చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం 12 కోట్లు తీసుకున్న బాలయ్య ఇప్పుడు 40 కోట్లకు వచ్చారు.

అలాగే ఈ సినిమా నిమిత్తం బోయపాటి శ్రీను ..కు 30 కోట్లు పే చేస్తున్నట్లు సమాచారం. బోయపాటి గత చిత్రం స్కంథ డిజాస్టర్ అయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ రెమ్యునరేషన్ తో ప్రూవ్ అవుతోంది.

అఖండ 2 చిత్రం బడ్జెట్ 175 కోట్ల దాకా ఉండబోతోందని వినికిడి.

తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. ‘స్కంద’ డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి.. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉండి, అద్బుతమైన స్క్రిప్టుతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు. పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుంది.

, , ,
You may also like
Latest Posts from