
ఆటిట్యూడ్ స్టార్‌కు థియేటర్లలో చుక్కలు.. బూతులు తిట్టినా చూడని జనం! షోలు క్యాన్సిల్!
ఈటీవీ ప్రభాకర్ తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్న ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ (Chandrahas) కి మరోసారి చుక్కెదురైంది. తన ప్రవర్తనతో, మాటలతో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురయ్యే ఈ కుర్రాడు.. తాజాగా ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, సినిమా కంటే వివాదాలే ఎక్కువ చేసిన చంద్రహాస్‌కు జనం గట్టి బుద్ధి చెప్పారు.
స్టేజ్ మీద బూతులు.. రియల్ లైఫ్ వివాదం!
సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రహాస్ స్టేజ్ మీద వాడిన అసభ్య పదజాలం పెద్ద దుమారమే రేపింది. క్షమాపణలు చెప్పేది లేదని మొండిగా వాదించడం, దాంతో అతనిపై కేసులు కూడా నమోదు కావడంతో ‘నెగటివ్ పబ్లిసిటీ’ అయినా సినిమాకు ప్లస్ అవుతుందని కొందరు భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది!
థియేటర్లలో ఈగలు తోలుకుంటున్న పరిస్థితి!
భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసినా, చంద్రహాస్ తండ్రి ప్రభాస్ ఎంతో కష్టపడి ప్రచారం చేసినా.. ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రాన్ని ప్రేక్షకులు కనీసం పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాకు మినిమం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది వచ్చిన ‘రామ్ నగర్ బన్నీ’ లాగే ఈ సినిమా కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.
గుణశేఖర్ ‘యుఫోరియా’ కూడా అదే బాటలో!
కేవలం చంద్రహాస్ మాత్రమే కాదు, సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ (Euphoria) పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. కొత్త రిలీజ్ లు ఏవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. వీకెండ్ లో కూడా ఈ సినిమాలు సర్వైవ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది.
