గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి) ఇద్దరూ ‘చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లు సెట్ అయిపోయిన బావా మరదళ్లు’. ఇంట్లో వాళ్లంతా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి ‘హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్’ అని సెటిల్ చేద్దామనుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే… పెద్దయ్యాక అంతా పరిస్దితిలు పూర్తిగా మారిపోయి ‘అవుట్ ఆఫ్ సిలబస్’ అయిపోతుంది. గిరి పెద్దయ్యేసరికి పక్కా ‘చిల్ పిల్’ బ్యాచ్. చదువు అబ్బక టెన్త్ లోనే ఫెయిలై, ఒక క్రేజీ బ్యాండ్ మేళం ట్రూప్ పెట్టుకుని ఊరంతా డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ ఫుల్ వైబ్ చేస్తుంటాడు. కెరీర్ గోల్స్ తక్కువ, రాజీ మీద ప్రేమ ఎక్కువ.
ఇక రాజీ మేటర్ కు వస్తే .. ఈమె ఒక ‘గో-గెట్టర్’. గిరి జులాయి వేషాలు చూసి చిరాకు పడి, అతగాణ్ణి ‘బ్లాక్ లిస్ట్’ లో పెట్టేస్తుంది. తనేమో బీటెక్ లో జాయిన్ అయ్యి, కెరీర్ లో దూసుకుపోవాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇది చాలదన్నట్లు రెండు ఫ్యామిలీల మధ్య ఇగో క్లాషెస్ పెరిగిపోతాయి. గిరి తన బ్యాండ్ బ్యాచ్‌తో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, లోలోపల మాత్రం రాజీ కోసం ‘సింపింగ్’ చేస్తూనే ఉంటాడు. తనని ఎలాగైనా ఇంప్రెస్ చేసి మళ్ళీ తన లైఫ్ లోకి ‘రీ-ఎంట్రీ’ ఇవ్వాలని ట్రై చేస్తుంటాడు.
ఈ క్రమంలో చదువులో వెనుకబడ్డ గిరి, తన ‘డప్పు మ్యూజిక్’ తో రాజీ మనసు గెలుచుకోగలడా? అసలు రాజీ మనసులో గిరి ఉన్నాడా లేక ఏదైనా కొత్త ‘క్యాట్ ఫిష్’ (Catfish) స్టోరీ నడుస్తోందా? ఈ బావా మరదళ్ల లవ్ స్టోరీ ‘సక్సెస్ ఫుల్ గా లోడ్’ అయిందా లేదా అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే!

ఎలా ఉంది
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. టైటిల్ అప్డేట్.. కథ అవుట్ డేటెడ్. సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది—”పాత చింతకాయ పచ్చడికి కొత్త సీసాలో పెట్టి లేబుల్ తగిలిస్తే అమ్ముడైపోతుంది” అని. కోన వెంకట్ అండ్ టీమ్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములా నమ్మారు. ఈ సినిమాలో కొత్తదనం ఏమైనా ఉందీ అంటే.. అది కేవలం ఆ ‘టైటిల్’ మాత్రమే. మిగతాదంతా మనం ఎప్పుడో చూసి, వాడేసి, పక్కన పడేసిన కంటెంటే!
ఉయ్యాల జంపాల రిపీట్ మోడ్?
అప్పట్లో రాజ్ తరుణ్ కొత్తగా వచ్చినప్పుడు ‘ఉయ్యాల జంపాల’ అంటూ ఒక రేంజ్‌లో ఊపేశాడు. ఆ వైబ్ ఇప్పుడూ వర్కవుట్ అవుతుందని మేకర్స్ గట్టిగా నమ్మినట్టున్నారు. కానీ .. ఇది 2026! కాలానికి తగ్గట్టు అప్డేట్ అవ్వాల్సిన కథను, కేవలం టైటిల్ మార్చి మన ముందుకు వదిలేశారు. స్క్రీన్ మీద సీన్స్ వస్తుంటే.. “అరేయ్! ఇది మనం ఎప్పుడో చూసేశాం కదా?” అని మన సబ్ కాన్షియస్ మైండ్ ‘నోటిఫికేషన్స్’ పంపిస్తూనే ఉంటుంది. దీన్ని మీరు ‘నోస్టాల్జియా’ అనుకుంటే ఓకే, లేదంటే పక్కా ‘నస’ అని ఫిక్స్ అయిపోవచ్చు.
ఫస్ట్ హాఫ్: గిరి అండ్ గ్యాంగ్ హంగామా
సినిమా ఓపెనింగ్ లోనే ఆ పాత కాలపు చైల్డ్ హుడ్ పోర్షన్ ఒకటి పెట్టి పుణ్యకాలం కాస్తా గడిపేశారు. హీరో బిల్డప్, ఆ బ్యాండ్ మేళం గ్యాంగ్ చేసే రచ్చతో ఫస్ట్ హాఫ్ ఎలాగోలా ఇంటర్వెల్ వరకు ‘బఫరింగ్’ లేకుండా సాగిపోయింది. ఇంటర్వెల్ దగ్గర ఏదో ‘బాహుబలి’ రేంజ్ ట్విస్ట్ ఉంటుందని ఆశిస్తే.. అక్కడ మనకి పెద్దగా కిక్ ఇచ్చే సీన్ ఏమీ పడలేదు.
సెకండ్ హాఫ్: రిపీట్ మోడ్ లో కథ!
అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. సెకండ్ హాఫ్ చూస్తుంటే.. యూట్యూబ్‌లో ‘ఆటోప్లే’ ఆన్ చేస్తే ఒకే వీడియో మళ్ళీ మళ్ళీ ప్లే అవుతున్నట్టు ఉంటుంది. కథ ఏ గల్లీలోకి వెళ్తుందో, అసలు డైరెక్టర్ కి ఏమైనా క్లారిటీ ఉందో లేదో ఎవరికీ అర్థం కాదు. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి పాత్రల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. ఎందుకు? అంటే లాజిక్ అడక్కండి.. సినిమా ముగించాలి కాబట్టి!
ప్లస్ పాయింట్స్ ఏంటి?
కామెడీ వైబ్స్: ఉన్నంతలో రిలీఫ్ ఏమిటంటే.. అక్కడక్కడా కామెడీ మాత్రం బాగా పండింది.
ఎమోషన్స్: పాత ఫార్ములానే అయినా, కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి.
మైనస్ లు
చెప్పటం మొదలెడితే ఆది, అంతం ఉండదు
టెక్నికల్ గా…
విజయ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే.. ప్లేలిస్ట్ లో రెండు పాటలు వినడానికి బాగున్నాయి కానీ, సినిమాలో ఆ సీన్స్ కి మాత్రం అస్సలు ‘సింక్’ అవ్వలేదు. కథలో డెప్త్ లేకపోవడంతో ఆ సాంగ్స్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వక ‘స్కిప్’ కొట్టాలనిపిస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) లో విజయ్ తన మార్క్ చూపించలేకపోయాడు. బహుశా డైరెక్టర్ రాసుకున్న సీన్స్ లో అంత ‘దమ్ము’ లేకపోవడం వల్ల మనోడు కూడా అంతగా ఎఫెక్ట్ పెట్టలేదనుకుంటా!
తెలంగాణ జానపదాలు:
మధ్య మధ్యలో కొన్ని పాపులర్ తెలంగాణ జానపద గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ వినిపిస్తాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఆ పాటలు వస్తున్నప్పుడు కూడా థియేటర్లో ఆడియన్స్ కి ఏమాత్రం ‘జోష్’ రాలేదు. ఆ వైబ్ అసలు ఎక్కలేదు!
క్వాలిటీ & మేకింగ్:
సినిమా క్వాలిటీ గురించి మాట్లాడకపోవడమే బెటర్. విజువల్స్ అన్నీ చాలా ‘లో-బడ్జెట్’ ఫీలింగ్ ఇస్తాయి. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టు, క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అంతా ‘లో-రెజల్యూషన్’ లో సాగినట్టు అనిపిస్తుంది.
ఫైనల్ వర్డిక్ట్:
ఈ సినిమా ఒక ‘వన్ టైమ్ వాచ్’ మాత్రమే. ఒకవేళ మీకు రొటీన్ బావా మరదళ్ల గొడవలు, పాత కాలపు లవ్ స్టోరీస్ ఇష్టమైతే ట్రై చేయొచ్చు. లేదంటే ఓటీటీ లో వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్.
వైబ్ చెక్: వెరీ ప్రిడిక్టబుల్ & అవుట్ డేటెడ్!

