టాలీవుడ్‌లో మళ్లీ బండ్ల గణేష్ హంగామా! నెల క్రితం ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ గురించి చేసిన కామెంట్లతో ఇండస్ట్రీని కుదిపేసిన బండ్ల గణేష్ (Bandla Ganesh) — ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తన సర్కాస్టిక్ డైలాగ్‌తో బన్నీ వాసు (Bunny Vas) వైపు తుపాకీ తిప్పాడు.

ఇటీవల ‘మిత్ర మండలి’ (Mithra Mandali) ప్రమోషన్స్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ — “మాకు ట్రోల్స్ చేస్తున్నవాళ్లు ఏం పీక్కుంటారో పీక్కోండి!” అంటూ ఫైర్ అయ్యాడు. ఆ మాటలు వైరల్ అయ్యి, “ఎవరిపై కోపం?” అనే చర్చ మొదలయ్యింది.

అదే సమయంలో సినిమా రిలీజ్ అయ్యి — పబ్లిక్, రివ్యూల దగ్గర దెబ్బతినడంతో — బండ్ల గణేష్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇలా ట్వీట్ చేశాడు

“అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు…
మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు!”

ఈ డైలాగ్ ఒక్కటే చాలు – సోషల్ మీడియా మళ్లీ మంటలేస్తోంది

ఇండస్ట్రీ వర్గాల వ్యాఖ్యానం:

“ఈ పోస్ట్ బన్నీ వాసు కామెంట్స్‌కి రివర్స్ పంచ్‌లా ఉంది!” అని కొందరంటున్నారు. మరికొందరు – “సినిమా నెగటివ్ టాక్ వచ్చిన వెంటనే ఈ పోస్టు రావడం యాదృచ్ఛికం కాదు” అంటున్నారు.

ఇక అభిమానుల్లో చర్చ మాత్రం ఒక్కటే –

“గణేష్ అప్పుడు అల్లు అరవింద్‌ని పొగిడాడా లేక చమత్కారంగా కొట్టాడా?”
“ఇప్పుడు ఈ పోస్టుతో బన్నీ వాసుకి సైలెంట్ షాట్ వేశాడా?”

టాలీవుడ్‌లో ఈ డ్రామా ఇప్పుడు ‘టీ కప్‌లో తుఫాన్ కాదు, కాఫీ కప్పులో సునామీ’ లా మారిపోయింది

, , , ,
You may also like
Latest Posts from