ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ ఊహించని విద్వంసం మొదలైంది! బాహుబలి రికార్డులు చెక్కుచెదరవని భావించిన వారందరికీ ఈ కలెక్షన్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. కేవలం నాలుగే రోజుల్లో ఒక ప్రాంతీయ సినిమా గ్లోబల్ రేంజ్లో ఇంతటి విధ్వంసం సృష్టించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక మనీ మేకింగ్ మిషన్ అని ‘ధురంధర్ 2’ నిరూపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. విడుదలైన మొదటి వారాంతంలోనే ఈ సినిమా సాధించిన వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ పండితులు సైతం షాక్‌లో ఉన్నారు.
కేవలం మూడు నెలల క్రితమే వచ్చిన మొదటి భాగం ఒక సెన్సేషన్ అయితే, ఇప్పుడు వచ్చిన సీక్వెల్ అంతకు మించిన సునామీని తీసుకువచ్చింది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి భారీ చిత్రాల లైఫ్ టైమ్ రికార్డులను కూడా ఈ సినిమా కేవలం వీకెండ్లోనే దాటేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రికార్డుల విద్వంసం:
మొదటి వారాంతంలో ఇండియాలో టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాను ఒకసారి గమనిస్తే ‘ధురంధర్ 2’ ఏ రేంజ్లో విరుచుకుపడిందో అర్థమవుతుంది:
పుష్ప 2: ₹770 కోట్లు+
ధురంధర్ 2: ₹660 కోట్లు+
బాహుబలి 2: ₹625 కోట్లు
కేజీఎఫ్ 2: ₹550 కోట్లు
చూశారుగా, ప్రభాస్ ‘బాహుబలి 2’ సాధించిన ₹625 కోట్ల రికార్డును ‘ధురంధర్ 2’ మట్టికరిపించింది. ఇప్పుడు ఈ సినిమా ముందున్న ఏకైక టార్గెట్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మాత్రమే. ఈ క్రేజ్ చూస్తుంటే ఆ రికార్డు కూడా ఎంతో కాలం నిలవదని స్పష్టమవుతోంది.

వర్కింగ్ డేస్‌లోనూ ఆగని జోరు:
వారాంతం అయిపోయినా ఈ సినిమా మేనియా ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా ₹34 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వీక్ డేస్‌లో సినిమాలు డల్ అవుతాయి, కానీ ‘ధురంధర్ 2’ విషయంలో మాత్రం పబ్లిక్ టాక్ అదిరిపోవడంతో థియేటర్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఫ్రాంచైజీ పవర్ తో పాటు కంటెంట్ లో దమ్ముంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయవచ్చో ఈ సినిమా నిరూపించింది.
రాబోయే రోజుల్లో ‘ధురంధర్ 2’ మరిన్ని అరుదైన మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు చూస్తుంటే ఇండియన్ సినిమా రేంజ్ మరో మెట్టు ఎక్కిందని చెప్పాలి. మరి ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటుందో చూడాలి!

