అందరూ రెడీ.. థియేటర్లు రెడీ.. సెన్సార్ కూడా ఖరారు! కానీ తీరా చూస్తే షోలు క్యాన్సిల్. ‘ధురందర్ 2’ తెలుగు వెర్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గట్టి షాకే ఇచ్చారు. అసలు సెన్సార్ పూర్తయినా కూడా షోలు ఎందుకు పడటం లేదు? ఈ సస్పెన్స్ వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి?
బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధురందర్ 2’ చుట్టూ ఉన్న కన్ఫ్యూజన్ అస్సలు తగ్గడం లేదు. నిజానికి మార్చి 18 నుంచే అన్ని భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, డబ్బింగ్ వెర్షన్ల సెన్సార్ ఫార్మాలిటీస్ సకాలంలో పూర్తి కాకపోవడంతో మొదటి రోజు కేవలం హిందీలో మాత్రమే విడుదలైంది. తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్‌కు నిన్న నిరాశే ఎదురైంది.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తెలుగుతో పాటు ఇతర భాషల సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యింది, కంటెంట్ కూడా థియేటర్లకు డెలివరీ అయిపోయింది. కానీ, నేడు కూడా షోలు క్యాన్సిల్ అవుతుండటం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక మేకర్స్ ఒక పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. రేపు రంజాన్ పండుగ సెలవు ఉండటంతో, ఆ అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి డబ్బింగ్ వెర్షన్లన్నింటినీ అధికారికంగా రేపే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
గత రెండు రోజులుగా షోలు పడతాయని ఆశించిన ఫ్యాన్స్, ఈ వరుస క్యాన్సిలేషన్లతో తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. మేకర్స్ ముందు నుంచీ తెలుగు రిలీజ్ ప్లాన్స్ విషయంలో సైలెంట్‌గా ఉండటం, ఇప్పుడు తీరా సెన్సార్ అయ్యాక కూడా వాయిదా వేయడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఈ సస్పెన్స్‌కు రేపటితో తెరపడనుంది.

అన్ని అడ్డంకులు దాటుకుని ధురందర్ 2 తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈ వెయిటింగ్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. సిద్ధంగా ఉండండి, రేపు అసలైన రచ్చ మొదలవుతుంది!

