“నేను లోపల ఏం వేసుకున్నానో లేదో మీకు ఎలా తెలుసు?” – అంటూ ఖుషి ముఖర్జీ మీడియా కు ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది!.

‘స్ప్లిట్స్‌విల్లా’ ఫేమ్ అయిన నటి ఖుషి ముఖర్జీ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కానీ ఈసారి నటన వల్ల కాదు… ఆమె డేరింగ్ డ్రెస్సింగ్‌ వల్ల. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఖుషి, గోల్డెన్ కలర్ హాల్టర్ నెక్ డ్రెస్సులో మెరిసిపోయింది. బ్యాక్‌లెస్, ప్లంజింగ్ నెక్‌లైన్, థై హై స్లిట్‌ ఉన్న ఆ డ్రెస్‌లో ఆమె ఫోటోలు రాత్రికి రాత్రే వైరల్ అయ్యాయి.

కానీ అక్కడే ఓ చిన్నపాటి వివాదం కూడా చోటు చేసుకుంది. ఫోటోలు తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆమెను చూసి “చడ్డి వేసుకుందా?” అనే అసభ్యమైన కామెంట్ చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. కొందరు ఆ వ్యక్తిని విమర్శించగా, మరికొందరు ఖుషి డ్రెస్‌ చాయిస్‌ను తప్పుపట్టారు.

ఇవి చూసిన ఖుషి ముఖర్జీ వైరల్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా స్పందించింది:

“మీరు చూసారా నేను చడ్డి వేసుకున్నానా లేదా? ఎవ్వరూ బయటికి తీయరు కదా! నేను థాంగ్ వేసుకున్నాను. దాని స్ట్రిప్‌ను పైకెత్తి ఉంచాను.”

అంతే కాదు, ఆమె డ్రెస్సులో అసౌకర్యంగా ఉందని కొందరు కామెంట్ చేయడం పట్ల కూడా ఖుషి క్లారిటీ ఇచ్చింది:

“గాలికి డ్రెస్సు కదలడం సహజం. కాబట్టి నేను పట్టుకుని సెట్ చేసుకుంటే, ‘ఊప్స్‌ మూమెంట్’ అయిపోతుందా? నాకు అసౌకర్యం అనిపించలేదు. నేను ఏ భాగాన్ని చూపించాలో బాగా తెలుసు. నా బాడీపై నాకు కంట్రోల్ ఉంది.”

అంటే స్పష్టంగా చెప్పాలంటే… ఖుషి ముఖర్జీకి ఓపెన్‌నెస్‌లో ఏమాత్రం తక్కువ లేదు. ఆమెకు విమర్శలు పెద్దగా పట్టనట్టుంది.

ఈ ఘాటు కామెంట్లతో ఖుషి మరోసారి క్లిక్ అయ్యింది. కానీ ఈసారి “ఫ్యాషన్ సెలెబ్రిటీగా?” లేక “బోల్డ్ బ్యూటీగా?” అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మీ అభిప్రాయం ఏమిటి? ఖుషి ఓపెన్‌నెస్ సరైనదా? లేక డ్రెస్సింగ్‌లో హద్దు అవసరమా?

You may also like
Latest Posts from