ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ని కాదు… ముంబై అండర్‌వర్ల్డ్‌ను కూడా షేక్ చేసేవి! 1990ల కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి మాఫియాతో ఓ మాస్క్ వేసుకున్న—సంబంధం ఉండేదనేది బహిరంగ రహస్యం. వారు చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసేవారు. చాలా మందిని బెదిరించేవారు. అయితే రోజులు, పరిస్దితులు మారాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ చీకటి బంధాన్ని గుర్తు చేస్తూ, బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఖయామత్ సే ఖయామత్ తక్ ఘన విజయం సాధించిన తర్వాత, అండర్‌వర్ల్డ్ నుంచి తనకు పార్టీలో పాల్గొనమని ఆహ్వానం వచ్చిందని ఆమిర్ స్వయంగా వెల్లడించారు.

“1990లలో ఓ పార్టీ కోసం దుబాయ్‌కు రావాలంటూ ఆఫర్ వచ్చింది. బహుమతులూ, డబ్బూ, అవసరమైతే బలవంతంగానూ తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. నా ఇంటికొచ్చి నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నేను స్పష్టంగా ‘నాకిది ఇష్టం లేదు’ అని చెప్పేశా. ఆ తరువాత వాళ్లు తిరిగి సంప్రదించలేదు. కానీ ఆ రోజులు నాకు బాగా భయపెట్టాయి,” అని ఆమిర్ తెలిపారు.

తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. ఇంట్లో భయాందోళన నెలకొంది. ‘వాళ్లతో మనకెందుకు? వాళ్లు చాలా పవర్‌ఫుల్‌’ అని నా తల్లిదండ్రులు కూడా కంగారుపడ్డారు. నేను నా కంటే కూడా నా భార్యాపిల్లల గురించే ఆలోచించా’’ అని ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. ఆమిర్ ధైర్యంగా మాఫియా ఆహ్వానాన్ని తిరస్కరించినా… అతడి మాటల్లోంచి అప్పటి ఆ ప్రభావం ఎంత తీవ్రమైందో స్పష్టంగా తెలుస్తోంది.

మాఫియా ఛాయలు ఇప్పుడు వెనకబడినా, ఆ కాలం నిశ్శబ్దంలో ఇంకా గుప్పుమంటోంది. ఇప్పుడు ఆమిర్ లాంటి నటులు ఆ నిజాలను వెలుగులోకి తీసుకురావడం చర్చలకు దారితీస్తోంది.

,
You may also like
Latest Posts from