మెగాస్టార్ చిరంజీవి, ఇటీవల వరుస ఫెయిల్యూర్లతో కాస్త వెనకబడ్డా… ‘వాల్తేరు వీరయ్య’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అయితే ఆ తరువాత వచ్చిన ‘బోళా శంకర్’ మాత్రం పెద్దగా నడవకపోవడంతో, చిరు సెటిల్డ్ మైండ్‌తో – పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కోసం వేచి చూశారు. అలా మొదలైంది ‘విశ్వంభర’!
ఈసారి కథా వస్తువు నుండి మ్యూజిక్ వరకు ప్రతీ అంశాన్ని మెగా స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సోషియో-ఫాంటసీ సినిమా మీద ఇండస్ట్రీలో బజ్ పెరుగుతోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్గా కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఎంపికైనట్టు సమాచారం.
కీరవాణి ట్యూన్స్… భీమ్స్ బీట్స్ కూడా?
సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే చిరుతో కలిసి బెంగళూరులోని ఫాం హౌస్ లో స్పెషల్ మ్యూజిక్ సెషన్స్ కూడా నిర్వహించారు. ఫస్ట్ సింగిల్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఊపేసింది.
తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే…
ఈ సినిమాకు కీరవాణితో పాటు భీమ్స్ సిసిరోలియో కూడా పని చేస్తున్నారట! అంటే ఒకే సినిమాలో ఒకవైపు ఆస్కార్ మ్యూజిక్ మాస్టర్, మరోవైపు యంగ్ మాస్ మ్యూజిక్ సెన్సేషన్?
సాధారణంగా ఇది జరగదు. కానీ విశ్వంభర స్కేల్ దృష్ట్యా… మ్యూజిక్‌లోనూ కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఓ మాస్ స్పెషల్ సాంగ్‌కి భీమ్స్ కంపోజిషన్ ఉంటుందన్న రూమర్ బలంగా వినిపిస్తోంది.
భీమ్స్ = మాస్ బ్లాక్‌బస్టర్ ఫార్ములా!
‘సంక్రాంతికి వస్తున్నాం’ పాటలతో భీమ్స్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్లు ఇచ్చాడు. అలాంటి ట్రాక్‌లో విశ్వంభరలో ఓ పాట ఉంటే, పల్లె పండగే అనిపించొచ్చు!
“మ్యూజిక్ అనేది ఒక్క ఫీలింగ్ మాత్రమే కాదు, ఆడియన్స్‌ని థియేటర్‌కి లాగే శక్తి!”
అంటోంది ఇండస్ట్రీ . కీరవాణి ట్యూన్లు already classyగా ఉండగా, భీమ్స్ మ్యాసీ బీట్ ఇస్తే… సినిమా మ్యూజిక్ అల్బమ్ ఆల్ రౌండ్ హిట్ అవుతుందన్న ఆశ.
ఇంకా అఫీషియల్ కాదు కానీ… ఇదే నిజమైతే?
ఇంకా భీమ్స్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ జత కలయికపై టాలీవుడ్లో బజ్ మామూలుగా లేదు. ఇద్దరి వేర్వేరు మ్యూజిక్ శైలులు కలిసితే, విశ్వంభర మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.