పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరి హర వీర మల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్. ఎన్నో ఏళ్లుగా షూటింగ్‌లో ఇరక్కుకుపోయిన ఈ సినిమా… ఎట్టకేలకు అన్ని పనులు పూర్తై జూలై 24న విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రేడ్‌లో కొత్త జోష్ వచ్చింది. ఇక తాజా అప్‌డేట్ అయితే ఫ్యాన్స్‌ను ఇంకా ఉత్సాహంగా డాన్స్ లు చేసేలా ఉంది.

మలయాళ క్రేజీ స్టార్ దుల్కర్ సల్మాన్ ఎంట్రీ!

తెలుగు సినిమాలకు కేరళలో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రం అక్కడ పెద్దగా రెస్పాన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు… హరి హర వీర మల్లు కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను స్వయంగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సినిమాని దుల్కర్ స్వంత నిర్మాణ సంస్థ వేఫేర్ ఫిల్మ్స్ ద్వారా సినిమాను విడుదల చేయబోతున్నాడు. లక్కీ భాస్కర్ తో మల్టీ-ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్న దుల్కర్ ఇప్పుడు పవన్ సినిమాకు కలిసొచ్చేలా ఉన్నాడు.

కమిషన్ బేసిస్ డీల్ – రిలీజుకు గ్రీన్ సిగ్నల్!

ఇటీవల వరుస వాయిదాలతో సినిమా పై వ్యాపార వర్గాల్లో డౌట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు దుల్కర్ ఈ ప్రాజెక్ట్‌కి కమిషన్ బేసిస్‌ రీతిలో రైట్స్ సొంతం చేసుకోవడం వెనుక బిజినెస్ డీల్స్ స్టార్ట్ అయ్యాయని, రిలీజ్ క్లియర్ అవుతుందనే సంకేతంగా ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ట్రైలర్ అప్‌డేట్ కూడా వచ్చే వారం

సినిమాకు సంబంధించి ట్రైలర్‌ అప్‌డేట్ ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. జూలై ఫస్ట్ వీక్‌లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. జూలై 24 వ తేదీకి రిలీజ్ లో ఏమీ తేడా రాకుండా ఉండేందుకు మేకర్స్ పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from