ప్రస్తుతం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. ఈ వారం ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ కలయికలో వచ్చిన కుబేరా భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర ఓ స్టడీ ట్రెండ్ కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే జూన్ 27న మంచు విష్ణు హీరోగా భారీగా రూపొందిన కన్నప్ప థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. దాంతో ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో కొత్త టెన్షన్‌ను నింపుతోంది. అయితే మంచు విష్ణు సినిమా అంటే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రభాస్ ఆ సినిమాలో కీలక పాత్రలో ఉండటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఓపినింగ్స్ బాగా వస్తాయని భావిస్తున్నారు.
మాస్ లేదని అంచనా, కానీ నంబర్స్ మాత్రం మాస్ స్థాయిలో!
వాస్తవానికి కుబేర సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేవు. మసాలా పాటలూ లేవు. కన్వెన్షనల్ కమర్షియల్ ప్యాకేజింగ్ దాదాపుగా కనిపించదు. అయినా… బుక్ మై షోలో గంటకు సగటున 4 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇది సాధారణంగా సోమవారం లాంటి రోజుల్లో చూడడం అరుదు. పైగా, ఈ సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కూడా కాదు. అంటే టార్గెట్ ప్రేక్షకులు క్లియర్‌గా లిమిటెడ్ – అయినా వీకెండ్ దాటాక కూడా వసూళ్లు బాగున్నాయి.
రెండు రోజుల్లో 50Cr+ గ్రాస్…
రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ దాటేసిన కుబేర, ఆదివారానికీ మంచి రన్ చూపించాడు. అధికారిక నంబర్లు ఇంకా వెల్లడి కాలేదు కానీ చిరంజీవి హాజరైన సక్సెస్ మీట్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే… బజ్ అసలు తగ్గలేదనిపిస్తోంది.
తమిళంలో తడబాటే కొంచెం టెన్షన్ పాయింట్
తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న కుబేర తమిళనాడులో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ గ్యాప్ నిర్మాతలకు ఫర్వాలేదనిపించినా, లాంగ్ రన్‌కు అది ఓ చిన్న అడ్డు కావొచ్చు. కాని ప్రస్తుతం బిజినెస్ ఎక్కువగా తెలుగులోనే తిరుగుతున్నందున, అది పెద్ద ఎఫెక్ట్ కాదన్న భావన ఉంది.
కన్నప్ప ఎంట్రీకి ముందు కుబేర గేమ్ ప్లాన్ క్లియర్
కన్నప్ప జూన్ 27న విడుదలవుతోంది. ప్రభాస్ ఉన్నాడన్నప్రచారం సినిమాకు భారీ ఓపెనింగ్ కలిగించే అవకాశముంది. కానీ కుబేర టీమ్ అప్పటికే గేమ్‌ప్లాన్ క్లియర్‌గా అమలు చేస్తోంది — సాధ్యమైనంత వరకు ఈ వారం బిజినెస్‌ని పూర్తి స్థాయిలో లాగేయాలి. అన్నట్టుగా దూసుకుపోతంది!
ఈ పోటీపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. కానీ కుబేర మాత్రం — తన కంటెంట్‌తో, తన స్వంత ట్రెండ్‌తో — ముందే బాక్సాఫీస్‌కి ఫుల్లీ లోడెడ్‌గా సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న — ఎవరు ఎవరి దారి వెళ్లగలుగుతారు? ఏమో కుబేర వెళ్లి కన్నప్ప కు అడ్డుపడుతుందేమో అంటోంది ట్రేడ్.