వరస ఫెయిల్యూల్స్ లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ లెటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో కథ, హీరో క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో చర్చలు జరిగి సినిమా చివరికి బిగ్ ఫెయిల్యూర్ అయింది.
ఇప్పుడు అదే సినిమా OTT లో స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది. దాదాపు “ట్రెండ్ అవుతుందా? లేక మరలా డిబేట్ స్టార్ట్ అవుతుందా?” అనేది పరిశ్రమ వర్గాల్లో డిస్కషన్.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: Netflix
డేట్: నవంబర్ 13
లాంగ్వేజెస్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం
సిద్ధు – నీరజ కోన కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఫెయిల్ అయినా… OTT లో మాత్రం సైలెంట్‌గా పేలుతుందా? లేక మరలా సోషల్ మీడియా వార్ మొదలవుతుందా? అన్నది చూడాలి.
ఒరిజినల్ టాక్:
కొంతమందికి కనెక్ట్ అయ్యింది, చాలా మందికి కాదు. అందుకే బాక్సాఫీస్ వద్ద ఝలక్ పడింది. ఇపుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో పెద్ద కరియాసిటీగా మారింది.
“థియేటర్ లో మిస్ అయ్యారా? OTT లో గివిట్ ఏ ట్రై!” అని నెట్‌ఫ్లిక్స్ రెడీగా ఉంది.

