సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ వేస్ట్ అని, అసలు తన గతం మొత్తాన్ని తుడిచేయాలనుకుంటున్నానని ప్రకటించి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాడు. అంతటి దిగ్గజ దర్శకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు వర్మ మైండ్‌ను అంతలా మార్చేసిన ఆ సినిమా ఏది? ఎప్పుడూ ఇతరులను విమర్శించే ఆర్జీవీ, ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ కాళ్ళ దగ్గర శిష్యుడిగా చేరతానని ఎందుకు అంటున్నాడు? వర్మ లేటెస్ట్ ఎక్స్ (Twitter) పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.
ఆటో డ్రైవర్ కావాలనుకున్నా.. కానీ!
తన చిన్ననాటి కోరికల గురించి వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పదేళ్ల వయసులో ఆటో రేస్ చేసే సౌండ్ నచ్చి ఆటో డ్రైవర్ కావాలనుకున్నాడట. ఆ తర్వాత అడవిలో బతకాలని, ఇంజనీర్ అవ్వాలని.. ఇలా రకరకాల ఆలోచనల తర్వాత చివరకు దర్శకుడిగా స్థిరపడ్డాడు. ‘గాడ్‌ఫాదర్’, ‘ఎక్సార్సిస్ట్’ వంటి సినిమాలను బెంచ్‌మార్క్‌గా పెట్టుకుని ‘సత్య’, ‘సర్కార్’, ‘భూత్’ వంటి ట్రెండ్ సెట్టర్స్ తీశానని, కానీ ఇప్పుడు అవన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దురంధర్ 2 దెబ్బకు ‘సర్కార్’ క్యాన్సిల్!
WHY SYNDICATE and not SARKAR?
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2026
SYNDICATE is based on a premise “ What if the entire law and order of INDIA collapses in just one single day”
It will be almost like a HORROR film , not because of any super natural elements , but because it will bare open the horrors that exist in…
రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్: ది రివెంజ్’ చూశాక తన ఆలోచనా విధానమే మారిపోయిందని వర్మ ఒప్పుకున్నాడు. ఆ సినిమా ముందు గాడ్‌ఫాదర్ కూడా నథింగ్ అని, అది ఒక కొత్త పాఠశాల అని కొనియాడాడు. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సర్కార్’ తదుపరి భాగాన్ని పక్కన పెట్టి, ‘సిండికేట్’ అనే కొత్త తరహా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. ఆదిత్య ధర్ లాంటి కొత్త తరం దర్శకుల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ తన ఇగోను పక్కన పెట్టి మరీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
భారత్ కుప్పకూలితే ఎలా ఉంటుంది?
ఆర్జీవీ అనౌన్స్ చేసిన ‘సిండికేట్’ కథ వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. “ఒక్క రోజులో ఇండియాలో లా అండ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోతే ఎలా ఉంటుంది?” అనే పాయింట్ మీద ఈ సినిమా ఉండబోతోంది. ఇది హర్రర్ సినిమా కాదు, కానీ మనుషుల మైండ్‌లో ఉండే భయంకరమైన ఆలోచనల వల్ల వచ్చే హర్రర్ అని వర్మ అభివర్ణించాడు. మార్చి 19న పాత సినిమాల పద్ధతులన్నీ చచ్చిపోయాయని, ఇప్పుడు మారకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే అని ఇండస్ట్రీ వర్గాలకు వార్నింగ్ ఇచ్చాడు.
వర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. మరి వర్మ అన్నట్టుగా ‘సిండికేట్’తో మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

