ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో తన చిరునవ్వుతో, నీలి కళ్ళతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాను షేక్ చేసిన ‘కుంభమేళా మోనాలిసా’ అలియాస్ మోనాలిసా భోంస్లే మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి తన గ్లామర్‌తో కాకుండా తన జీవితంలో తీసుకున్న ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయంతో నెటిజన్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. తనను కన్న తండ్రిని ఎదిరించి, మతాంతర వివాహం చేసుకుని మోనాలిసా ఇప్పుడు కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.

ఫేస్‌బుక్ పరిచయం.. ఆరు నెలల గాఢ ప్రేమ!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి పరిచయం ఫేస్‌బుక్ వేదికగా మొదలైంది. కేవలం ఆరు నెలల పాటు సాగిన ఈ ప్రేమాయణం, ఒకరినొకరు విడిచి ఉండలేనంత బలంగా మారింది. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో మోనాలిసా కుటుంబంలో పెను తుఫాను మొదలైంది. తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఈ పెళ్లికి ససేమిరా అనడమే కాకుండా, ఆమెకు ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించేందుకు ప్లాన్ చేశారు.

ఇంటి నుండి జంప్.. కేరళలో పోలీసుల అండ!
తండ్రి ఒత్తిడిని భరించలేక తన ప్రేమను కాపాడుకోవాలని నిశ్చయించుకున్న మోనాలిసా, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి నేరుగా కేరళకు చేరుకుంది. తమకు ప్రాణహాని ఉందని భయపడి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తన తండ్రి బలవంతంగా తనను తీసుకెళ్లాలని చూస్తున్నారని, తాను మేజర్‌ని కాబట్టి తన నిర్ణయం తనదేనని పోలీసులకు స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ఆమె నిర్ణయాన్ని గౌరవించిన పోలీసులు ఆ జంటకు రక్షణ కల్పించారు.
పోలీసుల సాక్షిగా.. ఆలయంలో సాదాసీదా పెళ్లి!
మోనాలిసా–ఫర్మాన్ వివాహం
— TelanganaDaily (@telanganadaily9) March 11, 2026
ఇండోర్, మధ్య ప్రదేశ్ వాసినీ మోనాలిసా, మహా కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ వైరల్ అయ్యారు.
తన ప్రియుడితో వివాహం చేసుకుని కుటుంబ ఒత్తిళ్ల నుండి రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.#Monalisa #KumbhMela #FarmanKhan #CelebrityUpdate pic.twitter.com/OIwpkPaktH
పోలీసుల సమక్షంలోనే తన తండ్రిని ఎదిరించి ప్రియుడి వెంట వెళ్లేందుకు ఆమె మొగ్గు చూపింది. అనంతరం కేరళలోని విళింజం వద్ద ఉన్న ఒక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. ఈ వివాహానికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టితో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. మతాలు వేరైనా, ప్రేమ కోసం ఆ అమ్మాయి తీసుకున్న సాహసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
#Monalisa Bhonsle, who became an overnight internet sensation during the #MahaKumbhMela, #Prayagraj, Married her Boyfriend Farman in #Kerala
— Surya Reddy (@jsuryareddy) March 11, 2026
Before Marriage #MonalisaBhonsle approached the police in #Thiruvananthapuram (or #Trivandrum) on Wednesday seeking protection to stay… pic.twitter.com/LHH5qLVjhq
కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ కనిపించిన ఆ సామాన్యురాలు, ఇప్పుడు తన ఆత్మగౌరవం కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కీర్తి కంటే మనసు మెచ్చిన వాడే ముఖ్యం అనుకున్న మోనాలిసా స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది.

