సినిమా వార్తలు

అవతార్ లో గోవిందాకు ఆఫర్ ! ఘోరంగా గాలి తీసేసిన భార్య సునీత!

ఒకప్పుడు బాలీవుడ్‌ను తన డాన్స్, కామెడీ, ఎనర్జీతో ఊపేసిన హీరో గోవిందా, కొన్నేళ్లుగా సినిమాలకన్నా తన మాటలతోనే వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఓ సంచలన వ్యాఖ్య అప్పట్లో అందరినీ ఒక్క క్షణం ఆలోచనలో పడేసింది. గోవిందా చెప్పినదాని ప్రకారం, “అవతార్ సినిమాని ముందుగా నాతో తీయాలనుకున్నారు. జేమ్స్ కామెరూన్ చాలా రోజులు నా వెంట పడ్డారు. కానీ మేకప్ వేసుకొని వేరే జీవిలా నటించాలంటే నాకిష్టం లేక నో చెప్పేశా” అని చెప్పారు.

ఈ స్టేట్‌మెంట్‌కి అప్పుడే చాలా మంది నమ్మలేదు, నవ్వుకున్నారు— “ఇది ఏంత మాత్రం నమ్మతగ్గదో!” అని కామెంట్స్ చేసారు. ఇప్పుడు అచ్చం అదే మాటను గోవిందా భార్య సునీత స్వయంగా చెప్పినట్లైంది!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ,

“అవతార్ లేదు గివతార్ కాదు! జేమ్స్ కామెరూన్ గానీ, ఆయన టీమ్ గానీ మా ఆయనతో సంప్రదించలేదని నాకు కచ్చితంగా తెలుసు. అసలు ఆలాంటి విషయమే ఎప్పుడూ జరగలేదు. ఆయన చెప్పినవి అన్ని ఊహాగానాలే. నిజానికి ఆ సినిమాని ఆయనకే ఆఫర్ చేశారనడం గాలి కబురే!” అని తేల్చేశారు.

ఇంతటితో ఆగలేదు సునీత. ఇటీవల గోవిందా యువ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకొని ఆమెను వదిలేయబోతున్నారనే రూమర్లకు కూడా ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

“ఆయన ఎక్కడికీ పోడు. నేనూ ఎక్కడికీ వెళ్లను. ఆయనకి నన్ను వదిలే సీన్ లేదు” అని తేల్చిచెప్పారు. పైగా, “నేను ఉన్నదున్నట్లు మాట్లాడతాను. అబద్దాల పల్లకి ఎక్కను” అని క్లారిటీగా చెప్పారు.

ఇంతవరకూ గోవిందా చెప్పిన “అవతార్” కథ ఒక సినిమాటిక్ స్కెచ్‌ మాత్రమేనో, లేక నిజంగా ఆయన ఆలోచనల గగనంలో విహరిస్తున్న కలగానో అనిపించేది. కానీ ఇప్పుడు భార్యే నేరుగా డౌట్ క్లియర్ చేస్తే, బహుశా ఆ మాటల్ని గాలి కబురుల లెక్కలో వేసుకోవడమే మంచిదేమో!

Similar Posts