సినిమా వార్తలు

అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ వివాదంపై హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాటల రచయిత హర్షవర్ధన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ మరియు బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ప్రవర్తనపై తనదైన శైలిలో విశ్లేషించారు. ముఖ్యంగా అనసూయ తన పిల్లల గురించి చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

మంచి ఉద్దేశం.. కానీ ప్రెజెంటేషన్ ఫెయిల్!

శివాజీ గారు లేదా అనసూయ గారు.. వీళ్ళిద్దరికీ మంచి ఉద్దేశాలే ఉండవచ్చు కానీ, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలోనే తప్పు జరుగుతోందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భాషా పరమైన ఇబ్బందుల వల్ల వారు చెప్పాలనుకున్నది ఒకటి అయితే, జనాల్లోకి వెళ్లేది మరొకటి అవుతోందని ఆయన విశ్లేషించారు.

“కోపం వస్తే బ్యాలెన్స్ తప్పుతాం”

“అసలు ఒక పది మందితో కంప్లైంట్ చేయించుకోవడం ఎందుకు? ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఎందుకు?” అని హర్షవర్ధన్ ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుతూ.. “మనిషికి కోపం వస్తే బ్యాలెన్స్ తప్పుతాం. ఆ సమయంలో మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. అలాంటప్పుడే వివాదాలు రాజకుంటాయి” అని హితవు పలికారు.

కన్న కొడుకే వద్దంటున్నా వినరా?
అనసూయ డ్రెస్సింగ్‌పై వస్తున్న విమర్శల గురించి హర్షవర్ధన్ ఒక షాకింగ్ వీడియోను ప్రస్తావించారు.

“నేను వేసుకున్న బట్టలు నా పిల్లలకే నచ్చవు అని అనసూయ గారే స్వయంగా ఒక వీడియోలో చెప్పారు. ఆమె పెద్ద కొడుకు ‘అమ్మా.. నీకు ఇలాంటి డ్రెస్సులు బాగాలేవు, నేను చూడలేకపోతున్నాను’ అని అంటాడట. దానికి ఆమె ‘అరేయ్.. అది నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను ఉంటాను’ అని బదులిస్తుందట. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.”

బయట జనం ఏమనుకుంటున్నారో హర్షవర్ధన్ క్లియర్ గా చెప్పారు. “తల్లిదండ్రులు చెబితే వినలేదు సరే.. కనీసం నీ కడుపున పుట్టిన బిడ్డ తన తల్లి డ్రెస్సింగ్ చూసి ఇబ్బంది పడుతున్నాను అని చెబుతున్నా వినవా?” అని జనం ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ కాదు!

చివరగా ‘స్వేచ్ఛ’ (Freedom) అనే పదంపై హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చారు. “స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు బట్టలు అనేవి అందులో ఒక చిన్న భాగం మాత్రమే కావచ్చు. కానీ కేవలం బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ అనుకుంటే పొరపాటే. దయచేసి ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇటు సినీ వర్గాల్లో, అటు అనసూయ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకే దారితీశాయి.

Similar Posts