టాలీవుడ్ అందాల భామ నిధి అగర్వాల్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’, రీసెంట్‌గా ప్రభాస్ పక్కన ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టులలో నటించి మెప్పించిన ఈ ‘ఇస్మార్ట్’ బ్యూటీ.. ఇప్పుడు ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి బయటపెట్టిన విషయాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తనను తొక్కేయడానికి ఇండస్ట్రీలో ఒక భారీ కుట్ర జరుగుతోందంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
హీరోయిన్లనే టార్గెట్ చేస్తున్నారా?
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్, తనపై జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ గురించి గట్టిగా స్పందించారు. “నటీనటులు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారిని మానసికంగా దెబ్బతీయడానికి కొందరు కావాలనే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి మరీ నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు. ఇది చాలా దారుణం. మా గురించి వచ్చే వార్తలు చూసి మా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు. మేం సమాధానం చెప్పాల్సింది కేవలం మా తల్లిదండ్రులకు మాత్రమే” అంటూ ఎమోషనల్ అయ్యారు.
కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌లకు సపోర్ట్!
కేవలం తన గురించే కాకుండా బాలీవుడ్ హీరోలు కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్‌ల గురించి వస్తున్న రూమర్లపై కూడా నిధి స్పందించారు.
“కార్తీక్ ఆర్యన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చాడు. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు.”
“వరుణ్ ధావన్ చాలా స్వీట్ పర్సన్, చిన్నపిల్లల మనస్తత్వం. తన కో-స్టార్స్‌ను ఎంతో ఎంకరేజ్ చేస్తాడు.” సెలబ్రిటీలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదని, వారిపై బురద చల్లడం ఆపాలని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఆ చేదు అనుభవాలు.. కాశీ యాత్రతో మార్పు!
రాజా సాబ్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ మాల్‌కు వెళ్ళినప్పుడు కొందరు అభిమానులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వివాదానికి దారి తీసింది. దీనిపై స్పందించిన నిధి, హీరోయిన్ల దుస్తుల వల్ల ఇలా జరుగుతుందనే విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. “బాధితురాలిదే తప్పు అని చెప్పడం పెద్ద మానిపులేషన్” అని కౌంటర్ ఇచ్చారు. అయితే, కాశీ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత తన ఆలోచనా విధానం మారిందని, దేవుడిపై నమ్మకం పెరిగిందని, ఇలాంటి ఎన్ని కుట్రలు జరిగినా ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కెరీర్ పరంగా వీరమల్లు, రాజా సాబ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ, నిధికి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నట్లు టాక్. తనపై జరుగుతున్న కుట్రలను ధైర్యంగా ఎదిరిస్తున్న ఈ అమ్మడు.. త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నారట. మరి నిధిని తొక్కేయాలని చూస్తున్న ఆ “అదృశ్య శక్తులు” ఎవరో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

