సినిమా వార్తలు

ఆ డైరెక్టర్‌కు జన్మలో పాట రాయను.. : చంద్రబోస్ సంచలన నిర్ణయం! ఎవరా డైరక్టర్?

ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన గేయ రచయిత చంద్రబోస్. సాధారణంగా ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక డైరెక్టర్ తనను ఎంతగా ఇబ్బంది పెట్టాడో వివరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. చంద్రబోస్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు.

డైరెక్టర్ మోసం:

ఒక డైరెక్టర్ చంద్రబోస్‌కు ఒక సిట్యుయేషన్ ఇచ్చి పాట రాయమన్నారట. తీరా చూస్తే, అదే సిట్యుయేషన్‌ను మరో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రికి కూడా ఇచ్చి పాట రాయమని అడిగారట.

షాక్ అయిన రైటర్లు: ఒకే పాట కోసం ఇద్దరు స్టార్ రైటర్లను రంగంలోకి దించి, ఆ విషయం ఇద్దరికీ చెప్పకుండా డైరెక్టర్ దాచిపెట్టడం చంద్రబోస్‌కు తీవ్ర కోపం తెప్పించింది.

“అతనితో పని చేయకూడదు అని నిర్ణయించుకున్నా!”

ఈ విషయంలో చంద్రబోస్‌కు ఉన్న నాలుగు ఆప్షన్లలో ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు.

శపథం: సదరు డైరెక్టర్ ఇంటికి వెళ్లి కొట్టడమో లేదా శపించడమో తన తత్వం కాదని చంద్రబోస్ అన్నారు.

నో వర్క్ విత్ హిమ్:

“అతనితో ఇంకెప్పుడూ పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. అది నా వల్ల అయ్యే విషయం.. నా పరిధిలో ఉన్న విషయం” అంటూ ఆ డైరెక్టర్‌కు జన్మలో పాట రాయకూడదని శపథం చేశారు.

రామజోగయ్య శాస్త్రితో చర్చ:

రామజోగయ్య శాస్త్రిని కలిసినప్పుడు ఈ విషయం బయటపడిందని, ఆ సమయంలో ఇద్దరం షాక్ అయ్యామని ఆయన గుర్తు చేసుకున్నారు.

Similar Posts