తమిళ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నటిస్తున్న జననాయకన్ (తెలుగులో జననాయకుడు) సినిమానే చివరిదని ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నిజంగా విజయ్‌కు ఫైనల్ ఫిల్మ్ అవుతుందా? అన్నది ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంది, అంటోంది ప్రేమలు ఫేమ్ మమిత బైజు.

మమిత బైజు ఏమంటోంది?

ఇన్నిరోజులూ విజయ్‌తో కలిసి జననాయకుడు షూటింగ్‌లో పాల్గొన్న మమిత బైజు, ఇటీవల ఐర్లాండ్‌లో జరిగిన కేరళ కార్నివల్ ఈవెంట్‌లో మాట్లాడింది. అక్కడ ఆమె చెప్పినట్లు –

“ఒకసారి విజయ్ సర్‌తో కలిసి షూట్ చేస్తున్నప్పుడు, సరదాగా అడిగాను… నిజంగా ఇది మీ చివరి సినిమా అనే మాట నిజమేనా అని. దానికి ఆయన సింపుల్‌గా, ‘ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో చూసేద్దాం. తరువాత ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ స్మైలింగ్‌గా సమాధానం ఇచ్చారు.”

అంతేకాదు, షూటింగ్ చివరి రోజుల్లో అందరిలోను ఎమోషన్ స్పష్టంగా కనిపించిందని, చివరిరోజున విజయ్ సర్ కూడా భావోద్వేగానికి లోనయ్యారని మమిత పేర్కొంది.

ఫ్యాన్స్ హ్యాపీగా వీడియో షేర్ చేస్తుండగా…

ఈ కామెంట్స్‌తో పాటు మమిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు “ఇంకా ఆశ ఉంది” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ సినిమాగా రూపొందుతున్న జననాయకుడు

జననాయకుడు సినిమాను హెచ్. వినోత్ డైరెక్ట్ చేస్తుండగా, విజయ్ సరసన మమిత బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్ నటిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

విజయ్ బర్త్‌డే అయిన జూన్ 22న విడుదలైన The First Roar గ్లింప్స్‌తో విజయ్ పోలీస్ యూనిఫాంలో మెరిసిపోతే… విజువల్స్ అదిరిపోయాయని ప్రశంసలు వచ్చాయి. అయితే అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ మాత్రం పెద్దగా పాపులర్ కాలేదు.

, ,
You may also like
Latest Posts from