శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన కుబేరా సినిమా, ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్‌తో 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తూ బ్లాక్‌బస్టర్ బాటలో దూసుకెళ్తోంది. కాని, కాన్సెప్టు సినిమాలకు స్ట్రాంగ్ గా బలంగా మద్దతు ఇచ్చే కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమాకు ఓపినింగ్స్ రాలేదు. అలాగే చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదంటే ఆశ్చర్యమే.

సాధారణంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మళయాళంలో ఎక్కువ రెస్పాండ్ అవుతుంటాయి. అయినా కుబేరాకు అక్కడ భాక్సాఫీస్ దగ్గర అసలు వర్కవుట్ కాలేదు.

ఇదే ట్రెండ్ ఇప్పటికే ఒకసారి మనం గతంలో చూశాం. ధనుష్ మొదటిసారి తెలుగు డైరెక్టర్ చేసిన సార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినా, కేరళలో మాత్రం ఒక కోటి మార్క్‌ కూడా దాటలేదు. ఇప్పుడు అదే ట్రెండ్ కుబేరా విషయంలోనూ రిపీట్ అవుతోంది.

ఒకవేళ తమిళ హీరో – తెలుగు డైరెక్టర్ కాంబినేషన్ అయితే కేరళ ఆడియెన్స్ కనెక్ట్ అవడంలో సమస్య ఉంటుందా? అనే డౌట్ కలుగుతోంది.

కుబేరా ఫస్ట్ వీకెండ్‌కి అన్ని చోట్లా వసూలు చేసిన మొత్తం మే 80 కోట్లు. కానీ కేరళలో మాత్రం మొదటి వారం చివరికి కేవలం 75 లక్షలకే పరిమితమైంది. వీకెండ్‌కి కూడా గ్రోత్ లేకపోవడంతో, ఫైనల్‌గా 1.5 కోట్లు కూడా దాటకుండానే సినిమా రన్ ముగిసే ఛాన్స్ ఉంది.

కంటెంట్ బలంగా ఉన్నా… టెక్నికల్స్, పెర్ఫామెన్స్ ఫస్ట్ క్లాస్‌గానే ఉన్నా… ఎందుకీ నిర్లక్ష్యం? అన్న ప్రశ్న మాత్రం కుబేరా టీమ్ కు అర్దం కావటం లేదు.

, , , , ,
You may also like
Latest Posts from